MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Career Guidance
  • UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !

UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !

UPSC Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రతిష్టాత్మక ప్రభుత్వ సేవలు, పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత యుపిఎస్సి పరీక్షకు హాజరవుతారు. UPSC ద్వారా లభించే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రధానంగా సివిల్ సర్వీసెస్, ఇతర కేంద్ర సేవలకు సంబంధించినవి.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 25 2025, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

UPSC Jobs: UPSC పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒక‌టి. ఇందులో ఉత్తీర్ణత సాధించడంతో దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. యూపీఎస్సీ కేవ‌లం ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు. ఇందులో చాలా ఉద్యోగాలే ఉన్నాయి. UPSC ఉద్యోగాలు అనేక గ్రూపులుగా ఉన్నాయి. ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులకు వారి ర్యాంక్, ప్రాధాన్యత ప్రకారం సర్వీస్ కేటాయిస్తారు. UPSC పరీక్షలో IAS, IPS, IFS మొదలైన సేవలతో పాటు ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన త‌ర్వాత అనేక విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. వాటిలో 


1. సివిల్ సర్వీసెస్ (ఆల్ ఇండియా సర్వీసెస్) 

ఏ. ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్): పరిపాలనా సేవలు, జిల్లా పరిపాలన, విధాన రూపకల్పన వంటివి ఉన్నాయి. 
బీ. ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్): శాంతిభద్రతలు, నేర నియంత్రణ, భద్రత, పోలీసు పరిపాలన.
సీ. IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్): అటవీ సంరక్షణ, పర్యావరణ నిర్వహణ, వన్యప్రాణుల రక్షణ.

34

2. కేంద్ర సేవలు

IFS (ఇండియన్ ఫారిన్ సర్వీస్): విదేశాంగ మంత్రిత్వ శాఖలో దౌత్య సేవలు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ఉద్యోగాలు.
IRS (ఇండియన్ రెవెన్యూ సర్వీస్): టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఆదాయపు పన్ను, కస్టమ్స్/ఎక్సైజ్ డ్యూటీ).
IAAS (ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్): ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణ.
IP & TAFS (ఇండియన్ పోస్ట్ & టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్): పోస్ట్, టెలికమ్యూనికేషన్ విభాగంలో ఆర్థిక నిర్వహణ.
ICLS (ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్): కార్పొరేట్ చట్టం, కంపెనీ వ్యవహారాల నిర్వహణ.
IIS (ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్): సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో మీడియా, కమ్యూనికేషన్.
ఐటిఎస్ (ఇండియన్ ట్రేడ్ సర్వీస్): వాణిజ్య విధానం, అంతర్జాతీయ వాణిజ్య ప్రమోషన్.

3. ఇతర గ్రూప్ A, B సేవలు

రైల్వే సేవలు: భారతీయ రైల్వేలలో వివిధ పరిపాలనా, టెక్నిక‌ల్ పోస్టులు.
రక్షణ సేవలు: సాయుధ దళాల ప్రధాన కార్యాలయంలో సివిల్ పోస్టులు.
ఇండియన్ పోస్టల్ సర్వీస్ : పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిర్వహణ, ఆప‌రేష‌న్స్. 
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్: BSF, CRPF, ITBP, SSB మొదలైన వాటిలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.

44

4. విభాగాలు, మంత్రిత్వ శాఖలు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆర్థిక మంత్రిత్వ శాఖ
విదేశాంగ మంత్రిత్వ శాఖ
రక్షణ మంత్రిత్వ శాఖ
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
రైల్వే మంత్రిత్వ శాఖ
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మొదలైనవి.

UPSCలో ఎంపిక ఎలా జరుగుతుంది?

ఈ పోస్టులకు యుపిఎస్‌సి ప్రధానంగా మూడు పరీక్షలు నిర్వహిస్తుంది:

సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE): IAS, IPS, IFS మొదలైన వాటికి.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDS): మిలిటరీ సర్వీసెస్ (పరిమిత సివిల్ పోస్టులు) కోసం.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) పరీక్ష: అసిస్టెంట్ కమాండెంట్ కోసం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పోలీసు భద్రత
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image2
రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Recommended image3
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved