39,481 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి మెగా నోటిఫికేషన్ : కేవలం పదో తరగతి అర్హతతోనే జాబ్స్
మీరు కేవలం పదో తరగతి పాసయి వుంటే చాలు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశాన్ని పొందండి. ఈ విద్యార్హతతో ఏకంగా 39,481 ఉద్యోగాల భర్తీకీ భారీ నోటిఫికేషన్ విడుదలచేసింది కేంద్రం. ఈ ఉద్యోగ భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం...
SSC Recruitment
Constable Recruitment : భారత ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా ఏకంగా 39,481 ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. సెప్టెంబర్ 5, 2024 న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసారు. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీని చేపడుతున్నారు... దీంతో తీవ్ర పోటీ వుండనుంది.
కేంద్ర సాయుధ బలగాల్లో ప్రతి సంవత్సరం కానిస్టేబుల్స్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తుంటారు. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్,ఎస్ఎస్బి, ఐటిబిటి, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకుంటారు. ఇలా ఈ ఏడాది కూడా భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియన ఎస్ఎస్సి ప్రారంభించింది.
ఇప్పటికే లక్షలాదిమంది యువత ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. పారామిలటరీ బలగాల్లో చేరాలన్న వారి కలను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కానిస్టేబుల్ తో పాటు రైఫిల్ మెన్ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఇలా ఏకంగా 39,481 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకటనతోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.కేవలం పదో తరగతి పాసయితే చాలు... ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి గత అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
SSC Recruitment
నియామక ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :
సాయుద దళాల్లో కానిస్టేబుల్ (జిడి) ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 5, 2024 లో నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ కూడా అప్పటినుండే ప్రారంభమయ్యింది... అక్టోబర్ 14 (11PM) చివరి తేదీ. దరఖాస్తు రుసుము చెల్లించడానికి మాత్రం ఓరోజు అదనంగా అంటే అక్టోబర్ 15 (11PM) వరకు సమయం ఇచ్చారు.
అయితే దరఖాస్తు సమయంలో ఏదయినా తప్పుచేస్తే సవరించేందుకు నవంబర్ 5 నుండి 7 వరకు సమయం ఇచ్చారు. ఇక పరీక్షలు వచ్చేఏడాది ఆరంభంలో అంటే 2025 జనవరిలో లేదంటే ఫిబ్రవరిలో వుండే అవకాశాలున్నాయి. ఇందుకు తగినట్లుగా ఎస్ఎస్సి ఏర్పాట్లు చేసింది.
SSC Recruitment
దరఖాస్తు ప్రక్రియ :
ఎస్ఎస్సి అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ను ఓపెన్ చేసి దరఖాస్తును ఫిల్ చేయాలి. వ్యక్తిగత వివరాలతో పాటు విద్యార్హతలను కూడా ఈ దరఖాస్తులో పేర్కొనాలి. ఏ భాషలో, ఎక్కడ పరీక్ష రాయాలనుకుంటున్నారో పేర్కొనాలి. ఈ దరఖాస్తే సమయంలో కొందరు అభ్యర్థులు నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి వుంటుంది.
జనరల్ పురుషులు 100 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
crpf Bharti
విద్యార్హతలు, వయోపరిమితి :
సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు కనీసం పదో తరగతి చదివివుండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి పదో తరగతి లేదా అందుకు సమానమైన చదువు వుండాలి.
ఇక 18 నుండి 23 ఏళ్లలోపు వయసున్న వారే ఈ ఉద్యోగాలను పొందేందుకు అర్హులు. అంట 02-01-2022 నుండడి 01-01-2007 మద్య జన్మించి వుండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు మాత్రం వయసు సడలింపు వుంటుంది. ఓబిసిలకు 3 ఏళ్లు, ఎస్సి, ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు.
సాలరీ :
జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ కు ఆరంభంలో నెలకు రూ.23,527 జీతం వుంటుంది. అత్యధికంగా నెలకు రూ.69,100 వరకు పొందవచ్చు. ఎన్సిబిలో సిపాయిగా చేరేవారికి నెలకే 18000 నుండి 56,900 రూపాయల వరకు వుంటుంది.
బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్,ఐటిబిపి, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్ లో చేరేవారు పే లెవెల్ 3 కింద రూ.21,700-69,100 వరకు ప్రతినెలా సాలరీ పొందుతారు. ఎన్సిబి లో సిఫాయి పే లెవెల్ 1 కింద రూ.18,000 నుండి 56,900 వరకు పొందుతారు.
విభాగాల వారిగా పోస్టుల వివరాలు :
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 15,654
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 7145
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) - 11,541
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) - 3017
సశస్త్ర సీమ బల్ (SSB) - 819
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 35
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) లో సిపాయిలు - 21
ఏఆర్ - 1248
సెలక్షన్ ప్రాసెస్ :
నాలుగు దశల్లో సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
స్టేజ్ 1 : రాతపరీక్ష (కంప్యూటర్ లో)
స్టేజ్ 2 : ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పిఈటి)
స్టేజ్ 3 : ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పిఎస్టి)
స్టేజ్ 4 : మెడికల్ టెస్ట్
మెడికల్ టెస్ట్ తర్వాత ఎంపికయిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వుంటుంది.
రాతపరీక్ష :
కంప్యూటర్ బేస్ పరీక్ష 160 మార్కులకు నిర్వహిస్తారు. 80 ప్రశ్నలకు 60 నిమిషాల్లో జవాబులు గుర్తించాల్సి వుంటుంది. తప్పుడు జవాబులకు నెగెటివ్ మార్కులు వుంటాయి.ఒక్కో తప్పుడు జవాబుకు 0.25 మార్కుల కోత పడుతుంది.
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ - 20 ప్రశ్నలు - 40 మార్కులు
జనరల్ నాలెడ్జ్, జనరల్ అవెర్ నెస్ - 20 ప్రశ్నలు - 40 మార్కులు
ఎలిమెంట్రీ మ్యాథ్స్ - 20 ప్రశ్నలు -40 మార్కులు
ఇంగ్లీష్ లేదా హిందీ - 20 ప్రశ్నలు - 40 మార్కులు