MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Jobs
  • Career Guidance
  • పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాాలు : వెంటనే అప్లై చేసుకొండి

పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాాలు : వెంటనే అప్లై చేసుకొండి

దక్షిణ రైల్వేలో ఉద్యోగాాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే కేవలం టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతతో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 13 2024, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దక్షిణ రైల్వేలో ఖాళీలు

దక్షిణ రైల్వేలో ఖాళీలు

దక్షిణ రైల్వే క్రీడా కోటా కింద 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు... ఈ మేరకు ప్రకటన వెలువడింది. స్పోర్ట్ కోటాలో అంటే రన్నింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్ వంటి వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు  (పురుషులు/మహిళలు) ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వంటి వివరాలను క్రింద ఇవ్వబడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఖాళీల వివరాలు

ఖాళీల వివరాలు

దక్షిణ రైల్వేలో మొత్తం 67 ఖాళీలు భర్తీ చేయబడతాయి, వీటిలో లెవల్ 1లో 46 ఖాళీలు, లెవల్ 2, 3లో 16 ఖాళీలు,  లెవల్ 4,5లో 5 ఖాళీలు ఉన్నాయి.

36
విద్యార్హతలు

విద్యార్హతలు

విద్యార్హతలు ఉద్యోగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కనీస విద్యార్హత 10వ తరగతి కాగా గరిష్టంగా డిగ్రీ. లెవల్-1 క్రీడా విభాగానికి దరఖాస్తు చేయాలంటే 10వ తరగతి లేదా ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. లెవల్ 2 లేదా 3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 12వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. లెవల్ 4, 5 ఉద్యోగాలకు డిగ్రీ పట్టభద్రులు అర్హులు.  

46
వయోపరిమితి

వయోపరిమితి

జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు జనవరి 1, 2025 నుండి లెక్కించబడుతుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్, OBC మరియు EWS కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ. 500. SC, ST, PwD కేటగిరీలు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు దరఖాస్తు రుసుము రూ. 250.

56
వేతన వివరాలు

వేతన వివరాలు

దక్షిణ రైల్వేలో లెవల్ 1 స్థానాలకు కనీస వేతనం రూ. 18,000, లెవల్ 2 రూ. 19,900, లెవల్ 3 రూ. 21,700, లెవల్ 4 రూ. 25,500, లెవల్ 5 రూ. 29,200.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఈ రైల్వే ఉద్యోగాలకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 7 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6. పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నారు. 

66
ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ

దక్షిణ రైల్వే క్రీడా కోటాకు ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష వుండదు... కేవలం శారీరక పరీక్షలు మాత్రమే ఉంటాయి. విద్యార్హతలు కలిగివుండి దరఖాస్తు చేసుకున్న క్రీడాకారులను మొత్తం 4 దశల్లో ఎంపిక చేస్తారు: క్రీడా విచారణ, శారీరక దృఢత్వ పరీక్ష, ధృవీకరణ పత్రాల పరిశీలన, చివరగా, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనే ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు https://iroams.com/ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకొండి.   

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్
Recommended image2
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Recommended image3
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved