ప్రతి ఏడాది రూ.40,000 : స్టూడెంట్స్ కు ఎల్ఐసీ బంపరాఫర్
ఎల్ఐసీ స్కాలర్షిప్ 2024: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అందిస్తోంది. డిసెంబర్ 22, 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్ షిప్ కింద ఎల్ఐసి ఎంత చెల్లిస్తుందో తెలుసా?
LIC Golden Jubilee Scholarship 2024
ఎల్ఐసీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ప్రారంభించింది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 22, 2024.
ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థులు ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు, NCVT గుర్తింపు పొందిన వృత్తి విద్యా కోర్సులకు కూడా వర్తిస్తుంది.
స్కాలర్షిప్ కేటగిరీలు
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ రెండు రకాలు:
1. జనరల్ స్కాలర్ షిప్ :
ఈ స్కాలర్ షిప్ కింద కోర్సు పూర్తయ్యేవరకు ఏడాదికోసారి స్కాలర్ షిప్ డబ్బులు పడతాయి.
2. బాలికలకు ప్రత్యేక స్కాలర్ షిప్ :
బాలికలపై అందించే స్పెషల్ స్కాలర్ షిప్ 10వ తరగతి పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు అందిస్తారు. అంటే ఇంటర్మీడిట్ లేదా డిప్లోమా వంటి కోర్సులు పూర్తిచేయడానికి కొంత మేర ఆర్థిక సాయం చేస్తారు.
అర్హత
ఈ జనరల్ స్కాలర్ షిప్ లేదా బాలికలకు అందించే స్పెషల్ స్కాలర్ షిప్ అయినా 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹2.5 లక్షల లోపు ఉంటేనే అర్హులు.
జనరల్ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు ఆ కోర్సు పూర్తయ్యే వరకు ఏడాదికోసారి డబ్బులు చెల్లిస్తారు. బాలికలకు మొదట రెండేళ్లపాటు ప్రత్యేక స్కాలర్ షిప్ అందిస్తారు. అర్హత ఉంటే ఈ స్కాలర్ షిప్ ను పొడిగిస్తారు.
మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులకు స్కాలర్షిప్
MBBS, BAMS, BHMS, BDS విద్యార్థులకు ₹40,000/- వార్షిక స్కాలర్షిప్. ₹20,000/- చొప్పున రెండు విడతలుగా చెల్లిస్తారు. BE, B.Tech, B.Arch విద్యార్థులకు ₹30,000/- వార్షిక స్కాలర్షిప్. ₹15,000/- చొప్పున రెండు విడతలుగా చెల్లింపు.
ఇంటిగ్రేటెడ్, ఐటిఐ కోర్సులకు స్కాలర్షిప్
ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్యా కోర్సులు, ఐటిఐ విద్యార్థులకు ₹20,000/- వార్షిక స్కాలర్షిప్. ₹10,000/- చొప్పున రెండు విడతలుగా.
బాలికలకు ప్రత్యేక స్కాలర్షిప్
డిగ్రీ, ఐటిఐ కోర్సులు చదివే బాలికలకు ₹15,000/- వార్షిక స్కాలర్షిప్. రెండేళ్లపాటు మొత్తం నాలుగుసార్లు ఈ స్కాలర్ షిప్ డబ్బులు చెల్లిస్తారు... అంటే ఒక్కోసారి ₹7,500/- చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 కోసం https://licindia.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ డిసెంబర్ 22, 2024. దరఖాస్తు చేసుకున్న తర్వాత, మీ ఈమెయిల్‌కు ఒక నిర్ధారణ సందేశం వస్తుంది.