- Home
- Jobs
- Career Guidance
- Indian Navy Jobs : రూ.1,00,000+ జీతం, ఇతర అలవెన్సులు ... భారత నౌకాదళంలో జాబ్స్
Indian Navy Jobs : రూ.1,00,000+ జీతం, ఇతర అలవెన్సులు ... భారత నౌకాదళంలో జాబ్స్
Indian Navy Jobs 2025: ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్ల నియామకం 2025 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మీకు అన్ని అర్హతలుండి నేవీలో జాబ్ చేయాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.

Indian Navy Jobs
Navy Jobs : ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 270 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
Indian Navy
దరఖాస్తుకు ముఖ్య తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం : ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తులకు చివరి తేదీ : 25 ఫిబ్రవరి 2025
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inను సందర్శించండి.
SSC నియామక లింక్‌పై క్లిక్ చేయండి.
హోమ్ పేజీలో ఉన్న "Indian Navy SSC Officers Recruitment 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
పేజీ ఓపెన్ కాగానే మీ వివరాలను నమోదు చేసి 'సబ్మిట్' చేయండి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
అవసరమైన సమాచారాన్ని పూరించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
భవిష్యత్తులో ఉపయోగం కోసం కన్ఫర్మేషన్ పేజీ హార్డ్ కాపీని భద్రపరచుకోండి.
దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంట్లను (ఎక్కువగా ఒరిజినల్‌లను JPG/TIFF ఫార్మాట్‌లో స్కాన్ చేసినవి) అప్‌లోడ్ చేయాలి
పోస్టుల వివరాలు :
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 154 పోస్టులు
ఎడ్యుకేషన్ బ్రాంచ్: 15 పోస్టులు
టెక్నికల్ బ్రాంచ్: 101 పోస్టులు
indian navy
విద్యార్హతలు (Indian Navy SSC Officers Recruitment 2025 eligibility criteria)
గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి వుండాలి. చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు... ఇలాంటివారు దృవపత్రాల పరిశీలన నాటికి కోర్పు పూర్తిచేసి వుండాలి.కనీసం 60% ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాల/సంస్థ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేయాలి. కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులయి వుండాలి.
జీతభత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹1,10,000 జీతం లభిస్తుంది. అభ్యర్థుల అర్హత, విధులను బట్టి ఇతర భత్యాలు కూడా ఇవ్వబడతాయి.
ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులను వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరి మెరిట్ జాబితా వారి SSC (సెలక్షన్ బోర్డ్) మార్కుల ఆధారంగా, ఖాళీలు, వైద్య పరీక్షల ఆధారంగా తయారు చేయబడుతుంది. వైద్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఖాళీలను బట్టి నియమిస్తారు.
Indian Navy
విద్యా ధృవపత్రాలు :
10వ/12వ సర్టిఫికెట్లు (పుట్టిన తేదీ ధృవీకరణతో సహా)
గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్/చివరి సంవత్సరం మార్క్స్ మెమోలు (అవసరమైన సెమిస్టర్ వరకు)
ప్రత్యేక ధృవపత్రాలు (వర్తిస్తే)
మర్చంట్ నేవీ సర్టిఫికెట్ (భారత ప్రభుత్వం, షిప్పింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రిత్వ శాఖ జారీ చేసినది)
NCC 'C' సర్టిఫికెట్ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్ జారీ చేసినది)
ఫోటోగ్రాఫ్: ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో
పూర్తి దరఖాస్తు ప్రక్రియ, అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.