గూగుల్ ఉచితంగా అందించే కోర్స్ చేయండి ...మీ కెరీర్ కు టాప్ గేర్ వేయండి
గూగుల్... ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు మీ కెరీర్ ను కూడా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓ కోర్సును ఆసక్తి కలిగినవారికి ఫ్రీగా అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది గూగుల్. ఆ కోర్సు, దానివల్ల లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

google Data Science Course
గూగుల్ ... అమెరికాకు చెందిన మల్టినేషనల్ కార్పోరేషన్ ఆండ్ టెక్నాలజీ కంపనీ. ఇది సెర్చ్ ఇంజన్ టెక్నాలజీతో పాటు ఆన్లైన్ ప్రకటనలు,క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సాప్ట్ వేర్, క్వాంటం కంప్యూటింగ్, ఈ-కామర్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఇలా ఎన్నో వ్యవహారాలను చూసుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపనీల్లో ఒకటి.
ఇలాంటి ప్రతిష్టాత్మక కంపనీ యువతకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. యువతకు మంచి కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఫ్రీగా కోర్సులు అందించేందుకు ముందుకువచ్చింది గూగుల్. ప్రెషర్స్ లేదా ఉద్యోగాలు చేస్తున్నవారు ఎవరైనా గూగుల్ అందించే ఫ్రీ డాటా సైన్స్ కోర్సు లో చేరవచ్చు. ఇందుకోసం ఇప్పటికే గూగుల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
google Data Science Course
గూగుల్ అందించే డాటా సైన్స్ కోర్స్ ద్వారా ఏం నేర్చుకోవచ్చు :
ప్రస్తుతం డాటా సైన్స్ కోర్సులకు మంచి డిమాండ్ వుంది. గూగుల్ అందించే ఈ ఫ్రీ కోర్సు ద్వారా మంచి కెరీర్ ను పొందవచ్చు. గూగుల్ అందించే అధునాతన ఢాటా అనలిసిస్ ను ఉపయోగించి సాధారణ కెరీర్ లేదా ఇండస్ట్రియల్ రంగంలో మంచి ఉద్యోగాలు పొందవచ్చు.
డాటా అనలిసిస్ ఎలా చేయాలో గూగుల్ నేర్పిస్తుంది. దాన్ని ఉపయోగించి మీ కెరీర్ ను మరింత సక్సెస్ ఫుల్ గా మార్చుకోవచ్చు. డాటా విశ్లేషనలో పట్టు సాధించి డెసిషన్ మేకింగ్ స్థాయికి చేరుకోవచ్చు.
డాటా ప్రైవసీ మరియు ఎథిక్స్ ను డాటా ప్రొఫెషనల్స్ ఎలా నిర్వహిస్తారో ఈ గూగుల్ ఫ్రీ కోర్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ ప్లాన్స్ కోసం ఈ డాటా అనలిసిస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.. టీం సభ్యుల పాత్రను, భాధ్యతలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఈ కోర్సు ద్వారా డాటా అనలిస్ట్, జూనియర్ డాటా అనలిస్ట్, అసోసియేట్ డాటా అనలిస్ట్ వంటి ఉద్యోగాలను పొందవచ్చు. ప్రొఫెషనల్ లెవెల్ ట్రైనింగ్ తో పాటు సర్టిఫికెట్ కూడా అందిస్తారు. గూగుల్ అందించే ఈ సర్టిఫికెట్ ప్రెషర్స్ కు కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
google Data Science Course
Google లో డాటా సైన్స్ కోర్సు వల్ల లాభాలు :
గూగుల్ లో ఢాటా సైన్స్ కోర్చు ఉచితమే. కానీ దీని ప్రభావం మన కెరీర్ చాలా వుంటుంది. ఈ కోర్సు చేసినతర్వాత మీ కెరీరే మలుపుతిరిగే అవకాశాలుంటాయి. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ కోర్సు ఇంత స్పెషల్ ఎందుకో తెలుసుకుందాం.
గూగుల్ బ్రాండ్ :
గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుపొందిన సంస్థ. టెక్నాలజీ రంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో కోర్సు చేయడం మీ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సమగ్ర అవగాహన :
గూగుల్ అందించే ఈ కోర్సు ద్వారా డాటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టికల్ మెథడ్స్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇది ప్రెషర్స్ గా కెరీర్ ప్రారంభించేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అనుభవం :
ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులను ఉదహరించే ఈ కోర్సులను కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవారి పనితీరు గురించి అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కోర్స్ ద్వారా నాలెడ్జ్ పొందడమే కాదు అనుభవాన్ని పొందవచ్చు.
సౌకర్యవంతమైన అభ్యాసం :
గూగుల్ అందించే ఈ డాటా సైన్స్ కోర్సు స్వతహాగా నేర్చుకునే విధంగా రూపొందించారు. అంటే యువత ఓవైపు తమ స్టడీని కొనసాగిస్తూనే ఈ కోర్సును కూడా పూర్తిచేయవచ్చు. వారి చదువుకు ఇది ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇలా చాలా సౌకర్యవంతంగా ఈ కోర్సును తీర్చిదిద్దింది గూగుల్.
google Data Science Course
ఈ గూగుల్ కోర్స్ ద్వారా మీరు పొందే నైపుణ్యాలు :
ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్
డాటా సైన్స్ పై మంచి పరిజ్ఞానంతో ప్రభావవంతంగా పనిచేయడం
టీమ్ ను వాస్తవ ఢాటా ఆధారంగా నడిపించడం
క్లైంట్స్ తో సంబంధిత విషయం గురించి లోతుగా చర్చించడం
ప్రభావంతంగా ప్రశ్నలను అడగడం
కమ్యూనికేషన్ పెంచుకోవడం
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
మీకు గూగుల్ అందించే ఫ్రీ డాటా సైన్స్ కోర్సులో చేరాలన్న ఆసక్తి వుందా? అయితే ఈ లింక్ https://www.coursera.org/professional-certificates/google-data-analytics క్లిక్ చేయండి.