- Home
- Jobs
- Career Guidance
- రూ.1,60,000 జీతం, ఇతర అలవెన్సులు : కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్ రిక్రూట్ మెంట్
రూ.1,60,000 జీతం, ఇతర అలవెన్సులు : కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్ రిక్రూట్ మెంట్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ జాబ్స్ కు సంబంధించిన విద్యార్హతలు, అప్లికేషన్, సాలరీ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకొండి.

Coal India Jobs
Coal India Jobs : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన 434 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజా నోటిఫికేషన్ ద్వారా మేనేజ్ మెంట్ ట్రైనీ ఇన్ ఈ-2 గ్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కోల్ ఇండియా ప్రకటించింది.
ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మీకు కింద పేర్కొన్న అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి. దేశంలోని మహారత్న కంపనీల్లో ఒకటయిన కోల్ ఇండియాలో ఉద్యోగాన్ని పొందండి. ఈ ఉద్యోగాల ద్వారా లక్షల జీతంతో పాటు సమాజంలో మంచి గౌరవాన్ని పొందవచ్చు.
Coal India Jobs
విభాగాల వారిగా ఖాళీలు, రిజర్వేషన్లు :
కమ్యూనిటీ డెవలప్ మెంట్ : మొత్తం 20 ఖాళీలు
తాజా ఖాళీలు : 13 (జనరల్ 6, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సి 2, ఎస్టి 1, ఓబిసి (NCL) 3)
బ్యాక్ లాగ్స్ : 7 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 2, ఎస్సి 2,ఎస్టి 3)
ఎన్విరాన్ మెంట్ : మొత్తం 28 ఖాళీలు
తాజా ఖాళీలు : 13 (జనరల్ 10, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సి 4, ఎస్టి 2, ఓబిసి (NCL) 7)
బ్యాక్ లాగ్స్ : 7 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 1, ఎస్సి 2,ఎస్టి 0)
ఫైనాన్స్ : మొత్తం 103 ఖాళీలు
తాజా ఖాళీలు : 56 (జనరల్ 22, ఈడబ్ల్యూఎస్ 5, ఎస్సి 8, ఎస్టి 5, ఓబిసి (NCL) 16)
బ్యాక్ లాగ్స్ : 47 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 5, ఎస్సి 2,ఎస్టి 40)
లీగల్ : మొత్తం 18 ఖాళీలు
తాజా ఖాళీలు : 9 (జనరల్ 6, ఈడబ్ల్యూఎస్ 0, ఎస్సి 1, ఎస్టి 0, ఓబిసి (NCL) 2)
బ్యాక్ లాగ్స్ : 9 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 1, ఎస్సి 6, ఎస్టి 2)
మార్కెటింగ్ ఆండ్ సేల్ : మొత్తం 25 ఖాళీలు
తాజా ఖాళీలు : 25 (జనరల్ 10, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సి 4, ఎస్టి 2, ఓబిసి (NCL) 7)
బ్యాక్ లాగ్స్ : 0 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 0, ఎస్సి 0, ఎస్టి 0)
మటెరియల్స్ మేనేజ్ మెంట్ : మొత్తం 44 ఖాళీలు
తాజా ఖాళీలు : 41 (జనరల్ 17, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సి 6, ఎస్టి 3, ఓబిసి (NCL) 11)
బ్యాక్ లాగ్స్ : 3 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 2, ఎస్సి 1, ఎస్టి 0)
పర్సనల్ ఆండ్ హెచ్ఆర్ : మొత్తం 97 ఖాళీలు
తాజా ఖాళీలు : 92 (జనరల్ 37, ఈడబ్ల్యూఎస్ 9, ఎస్సి 14, ఎస్టి 7, ఓబిసి (NCL) 25)
బ్యాక్ లాగ్స్ : 5 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 1, ఎస్సి 1, ఎస్టి 3)
సెక్యూరిటీ : మొత్తం 31 ఖాళీలు
తాజా ఖాళీలు : 30 (జనరల్ 12, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సి 5, ఎస్టి 2, ఓబిసి (NCL) 8)
బ్యాక్ లాగ్స్ : 1 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 1, ఎస్సి 0, ఎస్టి 0)
కోల్ ప్రిపరేషన్ : మొత్తం 68 ఖాళీలు
తాజా ఖాళీలు : 67 (జనరల్ 27, ఈడబ్ల్యూఎస్ 7, ఎస్సి 10, ఎస్టి 5, ఓబిసి (NCL) 18)
బ్యాక్ లాగ్స్ : 1 (ఓబిసి (నాన్ క్రిమిలేయర్) 0, ఎస్సి 1, ఎస్టి 0)
ఇలా రిజర్వేషన్ల వారిగా చూసుకుంటే 434 ఉద్యోగాల్లో జనరల్ 147, ఈడబ్ల్యూఎస్ 33, ఎస్సి 54, ఎస్టి 27. ఓబిసి 97 తాజా ఖాళీలు. మిగతా 76 బ్యాక్ లాగ్ పోస్టులు.
Coal India Jobs
ఉద్యోగాలవారిగా విద్యార్హతలు :
1. కమ్యూనిటీ డెవలప్ మెంట్ :
గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి కమ్యూనిటీ డెవలప్ మెంట్ లేదా రూరల్ డెవలప్ విభాగాల్లో కనీసం రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా వుండాలి. ఇందులో 60 శాతానికి పైగా మార్కులు సాధించి వుండాలి.
ఇక కనీసం రెండేళ్లు సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వున్నవారు కూడా అర్హులే. ఇందులోనూ 60 శాతానికి పైగా మార్కులు సాధించి వుండాలి.
2. ఎన్విరాన్మెంట్ :
ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ ను కనీసం 60 శాతం పూర్తిచేసివుండాలి. లేదంటే ఏదయినా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు పిజి లేదా డిప్లమా ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 60 శాతానికి పైగా మార్కులతో పూర్తిచేసివుండాలి.
3. ఫైనాన్స్ :
చార్టెడ్ అకౌంటెంట్ (CA) పూర్తిచేసి వుండాలి.
4. లీగల్ :
3 ఏళ్లు లేదంటే 5 ఏళ్ల లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసివుండాలి. ఇందులో కనీసం 60 శాతం మార్కులు సాధించివుండాలి.
5.మార్కెటిగ్ ఆండ్ సేల్స్ :
2 ఏళ్ల ఎంబిఏ తో పాటు డిగ్రీ వుండాలి. పిజి డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ (మార్కెంటింగ్) ను కనీసం 60 శాతం మార్కులతో పూర్తిచేసి వుండాలి.
6.మటేరియల్ మేనేజ్మెంట్ :
ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 ఇయర్స్ ఎంబిఏ లేదా పిజి డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ చేసివుండాలి. దేంట్లో అయినా 60 శాతానికి పైగా మార్కులు సాధించివుండాలి.
7. పర్సనల్ ఆండ్ హెచ్ఆర్ :
2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పిజి డిప్లమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ హెచ్ఆర్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్మెంట్ చేసివుండాలి. MHROD లేదా MBA లేదా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ హెచ్ఆర్ చేసినవారు అర్హులే. ఏదయినా 60 శాతానికి పైగా మార్కులతో వుండాలి.
8.సెక్యూరిటీ :
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వుండాలి.
9. కోల్ ప్రిపరేషన్ :
బిఈ/బిటెక్/బిఎస్సి(ఇంజనీరింగ్) ఇన్ కెమికల్/ మినరల్ ఇంజనీరింగ్/ మినరల్ ఆండ్ మెటలర్జికల్ ఇజనీరింగ్. కనీసం 60 శాతానికి పైగా మార్కులు సాధించివుండాలి.
పైన పేర్కొన్న విద్యార్హతల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నాటికి ఆ కోర్సును పూర్తిచేసిన సర్టిఫికెట్ అందించేవారు మాత్రమే ఉద్యోగాలను పొందుతారు.
Coal India Jobs
వయో పరిమితి :
18 నుండి 30 ఏళ్లలోపు అభ్యర్ధులు అర్హులు. ఇది జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వర్తిస్తుంది. ఇక ఓబిసిలకు 3, ఎస్సి ఎస్టి లకు 5 ఏళ్ల సడలింపు వుంటుంది. జనరల్ కేటగిరీ
వికలాంగులకు 10, ఓబిసి 13, ఎస్సి ఎస్టి 15 ఏళ్ల సడలింపు వుంటుంది.ఎక్స్ సర్వీస్ మెన్స్ కు ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వయసు సడలింపు వుంటుంది.
30 సెప్టెంబర్ 2024 నాటికి వయసును పరిగణలోని తీసుకుంటారు.
దరఖాస్తు సంబంధించిన ముఖ్యమైన విషయాలు :
కోల్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హతలు కలిగిన అభ్యర్తులు www.coalindia.in అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కేవలం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సనల్ గా ఎలాంటి దరఖాస్తులు స్వీకరించరు. ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో పలు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది.
కేవలం భారతీయులే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
దరఖాస్తు ఫీజు జనరల్,ఓబిసి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 1180 రూపాయలు చెల్లించాలి. ఎస్సి ఎస్టి, పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు వుండదు. ఈ ఫీజును కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.
దరఖాస్తుల స్వీకరణ జనవరి 15, 2025 న ప్రారంభమైంది. పిబ్రవరి 14, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
కంప్యూటర్ ఆధారిత ఆన్ లైన్ టెస్ట్ (CBT) లో సాధించిన మార్కుల ద్వారా నియామకం జరుగుతుంది. రెండు పేపర్లు, 3 గంటల సమయంలో పూర్తిచేయాల్సి వుంటుంది. వంద మార్కులకు పరీక్ష వుంటుంది.
సాలరీ :
కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రెయినీ ఈ2 గ్రేడ్ ఉద్యోగాలను పొందినవారు రూ.50,000 నుండి 1,60,000 వరకు సాలరీ పొందుతారు. ట్రైనింగ్ సమయంలో రూ.50,000 వేల సాలరీ వస్తుంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.