MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Career Guidance
  • మీరు ఐఏఎస్, ఐపిఎస్ కావాలనుకుంటున్నారా? : అయితే మీకోసమే ఈ సూపర్ స్కీమ్!

మీరు ఐఏఎస్, ఐపిఎస్ కావాలనుకుంటున్నారా? : అయితే మీకోసమే ఈ సూపర్ స్కీమ్!

ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే కాలేజీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

1 Min read
Author : Arun Kumar P
Published : Dec 15 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కేంద్ర ప్రభుత్వ పథకం

కేంద్ర ప్రభుత్వ పథకం

విద్య అనేది గొప్ప ధనం... దీన్ని సంపాదిస్తే చాలు డబ్బు, హోదా, గౌరవం వాటంతట అవే వస్తాయి. విద్యావంతుడు ఏ శిఖరానికైనా చేరుకోవచ్చు. అయితే పేదరికం కొందరు విద్యార్థులను చదువుకు, ఉద్యోగావకాశాలకు దూరం చేయవచ్చు. అందుకే ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేనివారు, వెనుకబడిన ప్రాంతాలు, కులాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు కేంద్రం సిద్దమయ్యింది. 

SC, ST, OBC (క్రీమీ లేయర్ కానివారు), మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

24
కాలేజీ విద్యార్థులు

కాలేజీ విద్యార్థులు

Coaching Schemes For Sc/st/obc (non-creamy Layer) & Minority Students For Universities పథకం కింద గ్రామీణ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోటీ పరీక్షలు, ఎన్ఈటి పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించి దరఖాస్తులను పొందాలి. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, విద్యా ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను సమర్పించాలి. అర్హులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

 

34
విద్యార్థులకు ఉచిత కోచింగ్

విద్యార్థులకు ఉచిత కోచింగ్

ఈ పథకం కింద శిక్షణ ఇచ్చే కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. పుస్తకాలు, పత్రికలు, బోధనా సామగ్రి, కంప్యూటర్లు, ఫోటోకాపియర్, జనరేటర్ లేదా ఇన్వర్టర్ వంటి వాటి కోసం గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు అందిస్తుంది.

44
రాష్ట్ర ప్రభుత్వ పథకం

రాష్ట్ర ప్రభుత్వ పథకం

విద్యార్థులకు శిక్షణ, సలహాలు ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలను కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉన్నత విద్య, ఉద్యోగాలు, IAS, IPS వంటి పోటీ పరీక్షలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి... ఇంగ్లీష్ తో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ, సలహాలు అందిస్తారు.

ప్రభుత్వ పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉచిత శిక్షణ పథకంలో చేరి ప్రయోజనం పొందవచ్చు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Recommended image2
UPSC Interview Questions : నిత్యం మండుతూనే ఉంటుంది, కానీ బూడిద ఉండదు.. ఏమిటది?
Recommended image3
Infosys : ఫ్రెషర్లకు జాక్ పాట్.. ఇన్ఫోసిస్ లో రూ. 21 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved