రూ.85,000 జీతంతో ఎస్బిఐ బ్యాంకులో జాబ్ : కేవలం డిగ్రీ పాసయితే చాలు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ అంటేనే సమాజంలో మంచి గౌరవం. అలాంటిది ఆ బ్యాంక్ ఛైర్ పర్సన్ స్థాయికి ఎదిగే స్థాయి ఉద్యోగమంటే మాటలా. అలాంటి ఉద్యోగాాల భర్తీకి ఎస్బిఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ జాబ్స్ గురించి వివరాలు తెలుసుకుందాం.

SBI PO Recruitment 2025
SBI Jobs : బ్యాంక్ జాబ్ అనేది చాలామంది యువత కల. హైదరాబాద్ లోని అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటూ వుంటారు. ఇక ఇరు రాష్ట్రాల్లోని చిన్నచిన్న పట్టణాల్లో కూడా బ్యాంక్ కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి... అంటే ఈ జాబ్స్ కు ఎంత క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నట్లే. అందుకోసమే ఎస్బిఐ లో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కల కంటుంటారు. ఇలాంటివారికి అద్భుత అవకాశం... ఎస్బిఐలో తాజాగా 600 పివో (ప్రొబెషనరీ ఆఫిసర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వివిధ బ్రాచుల్లో పనిచేయడానికి పివో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎస్బిఐ పివో ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇలా ఈ సంవత్సరం కూడా 600 పోస్టుల భర్తీకి సిద్దమయ్యారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్బిఐ దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది.
SBI PO Recruitment 2025
ఎస్బిఐ పీవో దరఖాస్తు విధానం :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పివో ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రొబెషనరీ ఆపీసర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. డిసెంబర్ 27,2024 లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జనవరి 16, 2025 వరకు కొనసాగుతుంది.
ఎస్బిఐ పివో ఉద్యోగాలకు సూచించిన అన్ని అర్హతలు కలిగి ఆసక్తి వున్నవారు దరఖాస్తు కోసం ముందుగా ఎస్బిఐ అధికారిక వెబ్ సైట్ www.sbi.co.in ఓపెన్ చేయాలి.
పేజ్ ఓపెన్ అయ్యాక అందులో కెరీర్ (Career) పై క్లిక్ చేయండి. వెంటనే కొత్తగా https://sbi.co.in/web/careers URL తో మరో పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇందులో Current Openings పై క్లిక్ చేయగానే తాజాగా ఎస్బిఐ విడుదల చేసిన జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు వస్తాయి. ఇందులో 'Recruitment for Probationary Officer' పై క్లిక్ చేయండి.
అక్కడ నోటిఫికేషన్ కు సంబంధించిన PDF ను డౌన్ లోడ్ చేసుకొండి. దాన్ని పూర్తిగా చదివితే అప్లికేషన్ ను ఫిల్ చేయడం ప్రారంభించండి.
'Apply Online' పై క్లిక్ చేయగానే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో సూచించిన చోట మీ వివరాలను ఫిల్ చేయండి. అలాగే అందులో అడిగిన డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి. ఫోటో, సంతకంను సూచించిన సైజులో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది.
అప్లికేషన్ ఫీజు చెల్లించండి... ఇది కేవలం ఆన్లైన్ లోనే చేయాలి. (ఎస్సి,ఎస్టి, పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు లేదు)
మరోసారి మొత్తం ఫామ్ ను సరిచూసుకుని అంతా సరిగ్గా వుందంటే సబ్మిట్ చేయండి. ఈ ఫామ్ ను సేవ్ చేసుకుని పెట్టుకోండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులకు రూ.750 అప్లికేషన్ ఫీజు వుంది
ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ఫీజు కేవలం ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి వుంటుంది.
SBI PO Recruitment 2025
విద్యార్హతలు :
ఏదయినా గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి డిగ్రీ పూర్తిచేసివుండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ రాసేవారు కూడా అర్హులే. అయితే ఇంటర్వ్యూ నాటికి వారు డిగ్రీ పూర్తిచేసి వుండాలి. చార్టెట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ కలిగినవారు కూడా అర్హులే.
వయో పరిమితి :
అభ్యర్థుల కనీస వయసు 21 సంవత్సరాలు. గరిష్ట వయసు 30 ఏళ్లు. అంటే 02-04-1994 నుండి 01-04-2003 మధ్య జన్మించినవారు అర్హులు. అయితే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులు 3 ఏళ్ల వయో పరిమితి సడలింపు వుంటుంది.
SBI PO Recruitment 2025
ఎస్బిఐ పివో ఎంపిక ప్రక్రియ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో పోస్టుల భర్తీ ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది. ఐబిపిఎస్ నిర్వహించే బ్యాంకింగ్ పరీక్షల కంటే ఇది కొంత కష్టంగానే వుంటుంది.
1. ప్రిలిమినరీ పరీక్ష
2. మెయిన్ ఎగ్జామ్
3. గ్రూప్ డిస్కషన్ ఆండ్ ఇంటర్వ్యూ
ముందుగా పీవో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అందరికీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సాలరీ :
ఎస్బిఐ లో ప్రొబెషనరీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలనెలా భారీ జీతం లభిస్తుంది. గతంలో ఎస్బిఐ పీవో లకు రూ.50 వేల లోపు సాలరీ వుండేది. కానీ ఇటీవల ఈ సాలరీని భారీగా పెంచారు. కొత్తగా ఎస్బిఐలో పీవోగా చేరేవారు నెలకు రూ.84,000 నుండి 85,000 వేల వరకు పొందుతారు. ఇక వసతి, టిఎ, డిఎ వంటి అలవెన్సులు, సదుపాయాలు అదనంగా వుంటాయి.
SBI PO Recruitment 2025
రిజర్వేషన్ల వారిగా ఎస్బిఐ పీవో పోస్టుల వివరాలు :
మొత్తం 600 పీవో పోస్టులు
ఎస్సి : 87 పోస్టులు
ఎస్టి : రెగ్యులర్ 43+ బ్యాక్ లాగ్ 14 = మొత్తం 57 పోస్టులు
ఓబిసి : 158 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ : 58 పోస్టులు
అన్ రిజర్వుడ్ :240 పోస్టులు
ఎస్బిఐ పీవో ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :
ఎస్బిఐ పివో నోటిఫికేషన్ 2025 : 26 డిసెంబర్ 2024
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం : 27 డిసెంబర్ 2024
రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 16 జనవరి 2025
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ : 16 జనవరి 2025
ఎస్బిఐ పీవో ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) : ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో వస్తాయి
ఎస్బిఐ పీవో ప్రిలిమినరీ ఎగ్జామ్ : మార్చ్ 8 లేదా 15, 2025 వుండే అవకాశం
మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ జారీ : 2025 ఏప్రిల్ 2వ వారంలో వస్తాయి
మెయిన్ ఎగ్జామ్ : ఏప్రిల్ లేదా మే, 2025 వుండే అవకాశం