MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • డిగ్రీ విద్యార్హతతో భారీగా ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

డిగ్రీ విద్యార్హతతో భారీగా ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (indian airforce)2023వ సంవత్సరానికి  ఐ‌ఏ‌ఎఫ్  ఏ‌ఎఫ్‌సి‌ఏ‌టి (IAF AFCAT)కింద అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి 317 పోస్టులను భర్తీ చేయనున్నారు.

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 01 2021, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఫ్లయింగ్ బ్రాంచ్, పర్మనెంట్ కమిషన్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్)‌ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఈ కోర్సుల్ని నిర్వహిస్తోంది. 2023 జనవరిలో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఈ 317 పోస్టులకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే https://afcat.cdac.in/AFCAT/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. డిసెంబర్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాలను https://careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్‌సైట్లలో చూడవచ్చు.

పర్మినెంట్‌ కమిషన్‌ ద్వారా చేరిన అభ్యర్థులు సంబంధిత బ్రాంచి, ర్యాంకు ప్రకారం సేవలు అందించాల్సి ఉంటుంది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా చేరిన అభ్యర్థులు 14 ఏళ్లు, గ్రౌండ్‌ డ్యూటీ ద్వారా చేరిన అభ్యర్థులు 10 సంవత్సరాలు సేవలు అందించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మొత్తం ఖాళీలు: 317
ఫ్లయింగ్‌: 77
గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌: 129
గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌: 111

అర్హత:
ఫ్లయింగ్‌ బ్రాంచి: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మేథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి.
జీతభత్యాలు: ఫ్లయింగ్‌ ఆఫీసర్లకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.

గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మేథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి.
విభాగాలు: ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌)
 

34

గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌): కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 2023 జనవరి 01 నాటికి ఫ్లయింగ్‌ బ్యాంచి అభ్యర్థులు 20 నుంచి 24 ఏళ్ల మధ్య, గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచి అభ్యర్థులు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ: జనవరి 2023లో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌(దుండిగల్‌)లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
శిక్షణ వ్యవధి: 52 వారాలు

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష(AFCAT) ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష: ప్రశ్న పత్రంలో మొత్తం 100 ప్రశ్నలుంటాయి. కేటాయించిన మొత్తం మార్కులు 300. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కట్‌ చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి సైకలాజికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
 

44

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఫీజు: రూ.250
దరఖాస్తు ప్రారంభం: 1 డిసెంబరు 2021
దరఖాస్తులకు చివరి తేదీ: 30 డిసెంబరు 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://afcat.cdac.in/AFCAT/

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు సిద్ధ‌మైన దిగ్గ‌జ సంస్థ‌.. వేలాది ఉద్యోగాల‌కు ఎస‌రు
Recommended image2
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image3
ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved