వైరస్ అక్కడే పుట్టింది.. ! వుహాన్ ల్యాబ్ లో ముగ్గురి మృతిపై వాల్ స్ట్రీట్ జర్నల్.. !!

First Published May 24, 2021, 12:31 PM IST

చైనాలోని వుహాన్ ల్యాబ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ ల్యాబ్ కు సంబంధించి మరో సంచలన వార్త బయటికొచ్చింది. దీంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ ఇక్కడినుంచి పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికల ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే అణు శాస్త్రవేత్తల జర్నల్ ‘బులెటిన్ ఓఆర్జి’ లో కూడా ల్యాబ్ లీకేజీ కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిలో వేటికీ చైనా ఆధారాలు చూపించలేదు. ఖండించలేదు.