భర్త ఫోన్లోని ఫోటోలు అత్తామామలకు పంపిన భార్య.. లక్ష నష్టపరిహారం ఇమ్మన్న కోర్టు...
మామూలుగా భర్తలు భార్యలమీద నిఘా పెడుతుంటారు. ఈ కేసులు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ భార్య భర్త మీద నిఘా పెట్టింది. ఇది తెలిసి ఆ భర్త, భార్య మీద కోర్టు కెక్కాడు. నష్టపరిహారం కోరాడు. దీని మీద విచారణ చేపట్టిన కోర్టు ఆసక్తికరమైన తీర్పు నిచ్చింది.
మామూలుగా భర్తలు భార్యలమీద నిఘా పెడుతుంటారు. ఈ కేసులు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ భార్య భర్త మీద నిఘా పెట్టింది. ఇది తెలిసి ఆ భర్త, భార్య మీద కోర్టు కెక్కాడు. నష్టపరిహారం కోరాడు. దీని మీద విచారణ చేపట్టిన కోర్టు ఆసక్తికరమైన తీర్పు నిచ్చింది.
అబుదాబికి చెందిన ఓ దంపతులకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. కొన్ని రోజుల పాటు వారి సంసారం బాగానే సాఫీగా సాగింది. కాలం గడిచే కొద్దీ భర్త మీద భార్యకు అనుమానం మొదలయ్యింది. తన భర్త తనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడనే అనుమానం ఆమెలో బలపడింది.
ఈ క్రమంలో ఆమె తన భర్త మీద నిఘా పెట్టింది. అంతేకాకుండా తన భర్త ఫోన్ లోని కొన్ని ఫోటోలను అతనికి తెలియకుండా.. అత్తామామలకు పంపింది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆ భర్త కోపంతో ఊగిపోయాడు. అంతటిలో ఆగకుండా తన భార్య నుంచి నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు.
ఈ క్రమంలో సదరు మహిళకు చెందిన లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదని, భర్త చేతిలో తన క్లయింట్ హింసకు గురైందని వాదించారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి లాయర్ జోక్యం చేసుకున్నాడు. తన క్లయింట్ వ్యక్తిగత గోప్యతను అతని భార్య హరించిందని వాదించారు.
అనుమతి లేకుండా ఫోటోలను కుటుంబ సభ్యలుకు పంపడం వల్ల తన క్లయింట్ మానసిక ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు. కేసు వ్యవహారం కారణంగా ఉద్యోగానికి కూడా వెళ్లలేదని వివరించాడు. దీంతో తన క్లయింట్ మానసికంగా కుంగిపోవడంతోపాటు, ఆర్థికంగా నష్టపోయాడని సదరు లాయర్ పేర్కొన్నాడు.
అందుకు తన క్లయింట్ కు అతని భార్య నుంచి నష్టపరిహారం ఇప్పించాలని లాయర్ కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు భర్త ప్రైవసీకి భంగం కల్పించిన కారణంగా అతనికి 5,400 దిర్హమ్ ల పరిహారం చెల్లించాల్సిందిగా భార్యను ఆదేశించింది.