కరోనా హైబ్రీడ్ ...యమా డేంజర్, గాలి ద్వారా ఒకరినుంచి ఒకరికి... !!
కరోనా కరాళ నృత్యం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్లతో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే కొత్తగా కరోనా హైబ్రిడ్ రకం వెలుగు చూస్తోంది. గత వేరియంట్‌లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కరోనా కరాళ నృత్యం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్లతో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే కొత్తగా కరోనా హైబ్రిడ్ రకం వెలుగు చూస్తోంది. గత వేరియంట్‌లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వియత్నాంలో సంకర కరోనా…
సాధారణంగా వైరస్ లో ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ నే ఉంటాయి. మొదట వచ్చిన వైరస్లతో పోల్చితే హాని చేయడంలో మార్పు చెందిన వైరస్ వేరియంట్లు చాలా ప్రమాదకరం.
అయితే తాజాగా ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకరమైన వేరియంట్ల నుంచి అత్యంత ప్రమాదకరమైన సంకరజాతి కరోనా వైరస్ పుట్టుకొచ్చింది.
వియత్నాంలో శాస్త్రవేత్తలు కరోనా హైబ్రిడ్ మ్యూటెంట్ ని కనుగొన్నారు. ఇండియాలో, బ్రిటన్లో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ లక్షణాలతో ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్ పుట్టుకొచ్చినట్లు వియత్నాం హెల్త్ మినిస్టర్ న్యూయెన్ థాన్ ప్రకటించారు.
వియత్నం దేశాన్ని ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చుట్టేస్తుంది. దేశంలో ఉన్న 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలో సగం కేసులు ఈ 31 నగరాల నుంచే వస్తున్నాయి.
దీంతో ఇక్కడ కరోనా బారిన పడ్డ రోగుల నుంచి తీసుకున్న శాంపిల్స్ పరిశీలించగా… ఇండియా, బ్రిటన్ లలో వెలుగుచూసిన కరోనా వేరియంట్ లక్షణాలతో కొత్త హైబ్రిడ్ వేరియంట్ పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ పూర్వపు వేరియంట్ లను మించిన వేగంతో త్వరగా వ్యాపిస్తుందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే లక్షణం ఈ హైబ్రిడ్ రకానికి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా, బ్రిటన్ లలో వెలుగుచూసిన వేరియంట్ల కంటే ప్రాణాలకు ఎక్కువ ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ వేరే ఇంటికి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం అంటోంది.
వియత్నాంలో వణుకు..
ఇప్పటికే వియత్నాంలో ఏడురకాల వేరియంట్ అను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కరోనా వేరియంట్లు వ్యాప్తిని గతంలో అక్కడి ప్రభుత్వం కట్టడి చేసింది. కానీ హైబ్రిడ్ కు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారింది.
ఇప్పటికే ఆ దేశంలో 6,396 మంది కరోనా బారిన పడగా, 47 మంది మరణించారు.. దేశంలో రోజురోజుకు హైబ్రిడ్ రకం ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో వియత్నాం ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది.