అంతరిక్షం నుంచి వచ్చిన రెడ్ వైన్.. ! ధర కేవలం రూ. 7,29,10,500 మాత్రమే.. !!
మీరు రెడ్ వైన్ ప్రియులా? ప్రపంచంలోని అన్నిరకాల రెడ్ వైన్స్ ను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. కాకపోతే దీన్ని రుచి చూడాలంటే మాత్రం మీరు కోటీశ్వరులై ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క బాటిల్ ధర సింపుల్ గా 7,29,10,500 రూపాయలు మాత్రమే.
మీరు రెడ్ వైన్ ప్రియులా? ప్రపంచంలోని అన్నిరకాల రెడ్ వైన్స్ ను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. కాకపోతే దీన్ని రుచి చూడాలంటే మాత్రం మీరు కోటీశ్వరులై ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క బాటిల్ ధర సింపుల్ గా 7,29,10,500 రూపాయలు మాత్రమే.
కళ్లు తేలేస్తున్నారా? ఇంత ఖరీదు ఎందుకు.. ఏంటి దీంట్లో స్పెషాలిటీ అంటారా? ఇది రెండేళ్ల పాటు అంతరిక్షంలో చక్కర్లు కొట్టొచ్చింది కాబట్టి.. అవును.. కోటీశ్వరులకు మాత్రమే సాధ్యమైన ఈ సేవల్ని అందిస్తుంది. స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ. ఇది నవంబర్ 2019 లో 12 రెడ్ వైన్ బాటిల్స్ ను అంతరిక్షంలోకి పంపింది. వీటికి 'పెట్రస్ 2000' అని పేరు కూడా పెట్టింది.
వైన్ బాటిల్స్ అంతరిక్షానికి ఎందుకు పంపారు అనేదే కదా మీ డౌట్...దానికీ కారణం ఉంది.. గ్రహాంతర వ్యవసాయానికి గల అవకాశాలను అన్వేషించడానికి ఈ సీసాలను అంతరిక్షంలోకి పంపారు. దీని ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 14 నెలలు గడిపిన తరువాత ఈ సీసాలు భూమికి తిరిగి వచ్చాయి అని నివేదికలు చెబుతున్నాయి. అంతరిక్ష కేంద్రంలో జీరో గ్రావిటీ దగ్గర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఈ వైన్ పరిపక్వం చెందింది.
ఎలా కొనుక్కోవాలి... అంటే... ‘క్రిస్టిసింక్’ అనే ప్రైవేట్ వేలం సంస్థ హ్యాండిల్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం.. ‘ఈ బాటిల్‌ను ఇటీవలే వేలంలో ఉంచారు. ఒక బాటిల్ ఫ్రెంచ్ వైన్ మిలియన్ డాలర్లు (రూ. 7,29,10,500) ఖర్చు అవుతుంది.
అంతేకాదు క్రిస్టీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇలా పేర్కొంది, "స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్ చేసిన ప్రయోగాల్లో భాగంగా, ఈ వైన్ మొట్ట మొదటి సారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి భూమికి తిరిగి వచ్చింది. దీనివల్ల ఇది మరింత మగ్గి అద్భుతమైన రుచిని సంతరించుకుంది. దీంతో ఇది ఒకరకమైన యూరోపియన్ 'న్యూ స్పేస్' స్టార్ట్-అప్.
ఇది కనక మీరు కొనుగోలు చేస్తే.. పెట్రస్ 2000 ప్రత్యేకమైన బాటిల్‌ను ఒక ప్రత్యేకమైన ట్రంక్‌లో అందిస్తారు. దీనిని పారిసియన్ మైసన్ డి ఆర్ట్స్ లెస్ అటెలియర్స్ విక్టర్ తయారుచేసిన హ్యాండీ క్రాఫ్ట్ ట్రంక్, టెరెస్ట్రియల్ పెట్రస్ 2000 బాటిల్, ఒక డికాంటర్, గ్లాసులు, ఉల్క నుండి తయారైన కార్క్ స్క్రూ దీంతో పాటు ఇస్తారు.
ఈ డబ్బును వారెలా ఖర్చు పెడతారు? ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. రెడ్ వైన్ ప్రియులకు సేకరణదారులకు ఇదో మంచి అవకాశం.. తమ దగ్గర ఓ అంతరిక్ష వస్తువు ఉందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో పరిశోధనలకు సాయం చేయచ్చు.