- Home
- International
- సవతి తండ్రి దారుణం : కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారులకు పచ్చబొట్లు.. ఆ తరువాత చర్మాన్ని కత్తిరించి..
సవతి తండ్రి దారుణం : కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారులకు పచ్చబొట్లు.. ఆ తరువాత చర్మాన్ని కత్తిరించి..
సవతి తండ్రితో కలిసి కన్నతల్లి కర్కశత్వాన్ని చూపించింది. ఇద్దరు పదేళ్లలోపు చిన్నారులకు బలవంతంగా టాటూలు వేసి.. ఆ తరువాత చర్మాన్ని కత్తిరించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అమెరికా : సవతి తల్లి పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తుందని అనేక కథనాలు.. నిజజీవిత ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. దీనికి విరుద్ధంగా కన్నతల్లి.. సవతి తండ్రి కలిసి ఇద్దరు చిన్నారులకి నరకం చూపించారు. ఈ దారుణమైన ఘటన వాషింగ్టన్ లో వెలుగు చూసింది. కన్నబిడ్డల జోలికి వస్తే ప్రకృతిలోని ఏ జీవి ఊరుకోదు.. కానీ ఈ కన్నతల్లి మాత్రం.. స్వయంగా నవ మాసాలు మోసి కన్న తన సొంత పిల్లలను.. చిత్రహింసలకు గురిచేసింది.
సవతి తండ్రితో కలిసి పిల్లలిద్దరికీ బలవంతంగా పచ్చబొట్లు పొడిపించారు. మళ్లీ వాటిని చేరపడం కోసం ఆ చిన్నారుల చర్మాన్ని కత్తిరించారు.చదువుతుంటేనే ఒళ్ళు జలదరిస్తున్న ఈ దారుణమైన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. గన్నర్ ఫార్ అని మహిళ అమెరికాలోని టెక్సాస్ లో ఉంటుంది. ఆమెకి తొమ్మిది, 5 ఏళ్ళు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడిపోయింది.
ఆ తర్వాత మేగాన్ మే ఫార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తన పిల్లలతో కలిసి అతనితో ఉంటుంది. ఈ క్రమంలోనే పిల్లలిద్దరికీ పచ్చబొట్లు వేయించాలని కన్నతల్లి, సవతి తండ్రి అనుకున్నారు. పిల్లలు టాటూ వేయించుకోవడానికి ఇష్టపడలేదు. వారి ఇష్టంతో పని లేదు అన్నట్టుగా పిల్లలిద్దరిని తాడుతో కట్టేశారు. వారు వద్దని ఏడుస్తుంటే.. నోట్లో గుడ్డలు కుక్కి.. కళ్ళకు గంతలు కట్టారు. ఆ తర్వాత ఓ చిన్నారికి కాలు మీద.. మరో చిన్నారికి భుజం మీద పచ్చబొట్లు పొడిచారు.
చిన్నారుల అసలు తండ్రి వారిని చూడడానికి ఒక రోజు వచ్చాడు. దీంతో ఈ దారుణమైన విషయం బయటపడింది. తాము చేసిన పని బయటపడడంతో పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన కన్నతల్లి గన్నర్, సవతి తండ్రి మేగాన్ మరో దారుణానికి ఒడిగట్టారు. పచ్చబొట్టు చెరిపేయడం కోసం… చిన్నారుల చర్మం మీద నిమ్మరసంతో రుద్దారు. గీరారు. అయినా పచ్చబొట్లు చెరిగిపోలేదు.
దీంతో అతి దారుణమైన చర్యకు పాల్పడ్డారు. చిన్నారుల చర్మాన్ని కత్తిరించారు. అలా పచ్చబొట్లను తీసేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చిన పోలీసులు చిన్నారులను పరిశీలించారు. వారి శరీరాలపై లోతుగా గాయాలు కనిపించాయి. దీంతో ఆ క్రూరత్ములు చేసిన విషయం వెలుగులోకి వచ్చి నిందితులను అరెస్టు చేశారు. వారిద్దరిని ప్రస్తుతం విచారిస్తున్నారు.