MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • International
  • 92యేళ్ల వయసులో చిన్న మెసేజ్ తో నాలుగో భార్యకు విడాకులు, ఐదో పెళ్లికి సిద్ధపడిన మీడియా మొఘల్.. అంతలోనే...

92యేళ్ల వయసులో చిన్న మెసేజ్ తో నాలుగో భార్యకు విడాకులు, ఐదో పెళ్లికి సిద్ధపడిన మీడియా మొఘల్.. అంతలోనే...

పదకొండు పదాల ఈ మెయిల్ తో 92యేల్ల వయసులో రుపర్ట్ ముర్డోచ్ తన నాలుగో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత కొద్ది రోజులకే ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 14 2023, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాషింగ్టన్ : ఓ వ్యక్తి 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్యకు విడాకులు ఇచ్చాడు. అదేంటి ఈ వయసులో విడాకులు ఇవ్వడమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆ విడాకులు ఇచ్చింది సాదాసీదా మనిషి కాదు మరి.. అమెరికా బిలినియర్, మీడియా మొగల్ గా ప్రసిద్ధిగాంచిన రుపర్ట్ ముర్డోచ్. ప్రస్తుతం ఆయనకు 92 ఏళ్ల వయసు. ఈ వయసులో తన నాలుగో భార్య అయిన 65 ఏళ్ల  జెర్రీ హాల్ కు విడాకులు ఇచ్చాడు. 11 పదాలతో ఓ చిన్న ఈ మెయిల్ సందేశం చేసి ఆమెతో తెగతెంపులు చేసుకున్నాడు. ఈ మెయిల్ వచ్చే సమయంలో ఆమె ముర్దోచ్ కోసం ఇంట్లో ఎదురుచూస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంతకీ ఆ 11 పదాల సందేశం ఏంటంటే.. ‘కచ్చితంగా మనం ఇద్దరం మంచి సమయం గడిపాం. అయితే, నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా న్యూయార్క్ లాయర్ తక్షణమే నిన్ను వచ్చి కలుస్తారు’ అని ఈ మెయిల్ చేశాడు. అలా ముర్డోచ్  కోసం ఎదురుచూస్తున్న జెర్రీకి విడాకుల సందేశం వచ్చింది. వీరిద్దరూ ఆరేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. ముర్డోచ్ కు జెర్రీతో జరిగింది నాలుగో వివాహం. అయితే జెర్రీకి మాత్రం అంతకుముందు వివాహం కాలేదు. ఇదే మొదటిది.  కాకపోతే రాక్ స్టార్ మిగ్ జాగర్ తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉంది.

35

అయితే, జెర్రీ, ముర్డోచ్ విడాకులు గతేడాది జూన్లో జరిగాయి. ఆ సమయంలో ఏం జరిగిందనేది తాజాగా జెర్రీ స్నేహితులు చెప్పుకొచ్చారు. ముర్డోచ్ పంపిన విడాకుల సందేశం చూసి జెర్రీ కోలుకోలేకపోయిందని.. ఆమె మైండ్ బ్లాంక్ అయిందని తెలిపారు. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకు ఏం చేయాలో తెలియలేదు.  కాలిఫోర్నియాలోని తన మాన్షన్ హౌస్ లో ఉన్న జెర్రీని 30 రోజుల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని విడాకుల విషయం చెప్పిన తర్వాత ముర్డోచ్ గడువు ఇచ్చాడు. దీంతో జెర్రీ పరిస్థితి దారుణంగా తయారయిందని ఆమె స్నేహితులు వాపోయారు.

45

ముర్డోచ్ కు ఆరుగురు సంతానం. ఆయన ఆస్తి 14.5 బిలియన్ డాలర్లు.  అయితే ఆరుగురు సంతానంలో ఒక్కరు కూడా జెర్రీకి పుట్టిన వారు కాదు. దీనివల్ల ముర్డోచ్ ఆస్తిలో ఆమెకు వాటా వచ్చే అవకాశమే లేదు. ముర్డోచ్, జెర్రీల వివాహం సెంట్రల్ లండన్ లో 2016లో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆ సమయంలో ముర్డోచ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ ప్రపంచంలోనే తాను అత్యంత అదృష్టవంతుడినని.. సంతోషకరమైన వ్యక్తిని అని ఆ సమయంలో ఆయన రాసుకొచ్చారు. ఇక ఆ తరువాత ట్విట్టర్లో తాను పోస్టులు పెట్టబోవడం లేదని కూడా ప్రకటించారు.

55

92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించిన ముర్డోచ్..  గత నెలలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. జెర్రీకి విడాకులు ఇచ్చి ఏడాది కూడా గడపక ముందే  ఐదో పెళ్లికి సిద్ధపడ్డాడు. అన లెస్లే స్మిత్ నుపెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెప్పాడు. ఏడు నెలల క్రితమే ఈమె పరిచయమైనట్లుగా తెలుస్తోంది.  అయితే ఈ ప్రకటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముర్డోచ్ ఐదో పెళ్లి అనుకోకుండా రద్దయింది. వీరి పెళ్లి ఆలోచన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. ముర్డోచ్ ది సన్, ది  టైమ్స్ వంటి న్యూస్ పేపర్లు..  ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి మీడియా సంస్థలకు యజమాని. అమెరికాలో స్థిరపడ్డ ముర్డోచ్ ఆస్ట్రేలియాలో జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా మొగల్ గా గుర్తింపు పొందారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved