వణికిస్తున్న వియత్నాం వేరియంట్ : హైబ్రీడ్ రకం గురించి ఎందుకు భయపడాలంటే...

First Published May 31, 2021, 12:42 PM IST

కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. రోజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతూ కాస్త ఊరటను కలిగిస్తుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ తాజా వేరియంట్ కొత్త గుబులు పుట్టిస్తోంది. కరోనా ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఇప్పటికే మానవాళిని భయాందోళనల్లోకి నెట్టేసింది. ఇప్పుడీ కొత్త వేరియంట్ మీద అనేక సందేహాలు, భయాలూ నెలకొంటున్నాయి.