MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • covid 19 : ఆరు దేశాల్లో డేంజరస్ C.1.2 వేరియంట్.. ఆందోళనలో శాస్త్రవేత్తలు..

covid 19 : ఆరు దేశాల్లో డేంజరస్ C.1.2 వేరియంట్.. ఆందోళనలో శాస్త్రవేత్తలు..

C. 1.2 అనేది 2020 మధ్యలో దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ కు కారణమైన C.1 నుంచి అభివృద్ధి చెందింది. ఇది చైనాలోని వుహాన్ లో కనుగొనబడిన అసలు వైరస్ కంటే 44 -55 ఉత్పరివర్తనాలు కలిగి ఉంది. క్రిస్ప్ అని పిలిచే క్వాజులు-నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో సహా దక్షిణాఫ్రికా గ్రూపులు ఈ పరిశోధనను ప్రచురించాయి.

2 Min read
Author : Bukka Sumabala
Published : Aug 31 2021, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు అనేక కొత్త ఉత్పరివర్తనాలతో ఉన్న కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ ను కనుగొన్నారు. 

 

C.1.2 గా పిలిచే ఈ రకం వేరియంట్ ను మే లో గౌటెంగ్, మపుమలాంగా, దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా ప్రావిన్సులు,  జోహన్నెస్ బర్గ్ లలో కనుగొన్నామని శాస్త్రవేత్తలు ఓ పరిశోధనా పత్రంలో తెలిపారు. ఆగస్ట్ 13 నాటికి ఇది దక్షిణాఫ్రికాలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఆరు ప్రావిన్సుల్లో.. రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, పోర్చుగల్, న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ లలో కనిపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వైరస్ లోని ఉత్పరివర్తనలు ‘పెరిగిన ట్రాన్స్ మిసిబిలిటీతో సంబంధం కలిగి ఉంటాయి’..అంతేకాదు ప్రతిరోధకాలను తప్పించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఉత్పరివర్తనాల సమూహానికి సంబంధించి ఈ వేరియంట్ మీద దృష్టి పెట్టడం ముఖ్యం’ అని తెలిపారు. 

వైరస్ లో మార్పులు.. డెల్టా వేరియంట్ తో కరోనా వైరస్ లలో వేవ్ లకు కారణమవుతుంది. ఈ డెల్టా వేరియంట్ ముందు భారత్ లో కనుగొనబడింది. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంక్రమణ రేటును పెంచుకుంటుంది. ఈ ఉత్పరివర్తనాలను వేరియంట్లుగా  ప్రపంచఆరోగ్య సంస్థ వర్గీకరిస్తుంది. వాటిని కనిపెట్టిన తరువాత వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంది అన్న దాన్ని బట్టి ఆందోళనకరమా, కాదా అనేది గుర్తిస్తుంది. 

35

C. 1.2 అనేది 2020 మధ్యలో దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ కు కారణమైన C.1 నుంచి అభివృద్ధి చెందింది. ఇది చైనాలోని వుహాన్ లో కనుగొనబడిన అసలు వైరస్ కంటే 44 -55 ఉత్పరివర్తనాలు కలిగి ఉంది. క్రిస్ప్ అని పిలిచే క్వాజులు-నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ తో సహా దక్షిణాఫ్రికా గ్రూపులు ఈ పరిశోధనను ప్రచురించాయి. మేలో ఈ వేరియంట్ 0.2 శాతం జన్యువులు కలిగి ఉన్నట్టు తేలగా, అది జూన్ లో 1.6 శాతం, జూలైలో 2 శాతానికి పెరిగింది. 

45

టీకాలు వేసుకున్నవారిలో, వేసుకోని వారిలో ఈ వేరియంట్ ను యాంటీబాడీలు ఏవిధంగా న్యూట్రలైజ్ చేస్తున్నాయన్న అంశాన్ని మేము ప్రసుతం అంచనా వేస్తున్నామని శాస్త్రవేత్త అంటున్నారు. ఈ ఫలితాలు ఓ  వారంలోగా చెబుతామని క్రిస్ప్ డైరెక్టర్ తులియోడి ఒలివెరా సోమవారం జరిగిన ఓ ఇమ్యునాలజీ సమావేశంలో చెప్పారు. 

55

‘ఇది వంద జన్యువుల్లో మాత్రమే కనుగొనబడింది. నిజానికి ఇది చాలా తక్కువ సంఖ్య’ అని ఆయన అన్నారు. ఇది ప్రస్తుతానికి చాలా తక్కువ శాతమే.. అయితే దీనిమీద మనం నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇది రోగ నిరోధకశక్తిని అధిగమించే లక్షణాలు కలిగి ఉంది’ అన్నారు. 

2020లో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్త బీటా వేరియంట్ ను కనుగొన్నారు. ధేశంలోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం వల్ల  వైరస్ జన్యువుల సీక్వెన్స్ ను కనిపెడుతున్నామని, అయితే ఇవి మరెక్కడా పుట్టే అవకాశం లేదని నొక్కి చెప్పారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved