ట్రంప్ ఎత్తుగడ: అచ్చం పవన్ కల్యాణ్ లాగే అమెరికా ఎన్నికల్లో కిమ్ కర్దాషియన్ భర్త

First Published 6, Jul 2020, 7:47 AM

అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తాను సైతం అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కాన్యే వెస్ట్ ఎప్పుడైతే ఇలా తాను కూడా బరిలో నిలవబోతున్నాను అని చెప్పారో అందరూ ఆసక్తిగా అసలు అమెరికా రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అని అక్కడ రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఈ నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్, రిపబ్లికన్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న విషయం కూడా విదితమే. నవంబర్ మూడవ తారీఖు దెగ్గరికొస్తుండడంతో... అమెరికాలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది.

తాజగా శనివారం నాడు అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తాను సైతం అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కాన్యే వెస్ట్ ఎప్పుడైతే ఇలా తాను కూడా బరిలో నిలవబోతున్నాను అని చెప్పారో అందరూ ఆసక్తిగా అసలు అమెరికా రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అని అక్కడ రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

కాన్యే వెస్ట్ గతంలో తాను 2020లో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతాను అని చెప్పాడు. మొన్న ఒక సంవత్సర కాలం కింద తాను 2024లో పోటీ చేస్తాను అని అన్నాడు. ఇలా పలుమార్లు అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం గురించి మాట్లాడాడు. ఈసారి తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నాను అని ప్రకటించాగానే... టెస్లా కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ తన మద్దతును కాన్యే వెస్ట్ కి ప్రకటించాడు.

ఎలోన్ మస్క్ మద్దతు ప్రకటించడంతో ఒకింత సీరియస్ గా కాన్యే వెస్ట్ ప్రకటన గురించి ఆలోచిస్తున్నారు కొందరు. కాన్యే వెస్ట్ ఒక నల్ల జాతీయుడు. పాప్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త కిమ్ కర్దాషియన్ భర్త.

జార్జ్ ఫ్లాయిడ్ హత్యా అనంతరం అమెరికా అట్టుడికి పోతుంది. ట్రంప్ క్లియర్ గా వెనుకబడ్డట్టుగా మనకు కనబడుతుంది. అమెరికాలోని అన్ని సర్వేలు ఇదే విషయాన్నీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తిరిగి అధికారం చేపట్టాలంటే చాలా కష్టించవలిసి ఉంటుంది. ట్రంప్ ఈ సమయంలో ఎలాంటి నీచ రాజకీయాలకయినా ఒడిగడతాడు అని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయులు ఓట్లన్నీ డెమొక్రాట్ జో బిడెన్ కె అనుకూలంగా పడనున్నాయి. శ్వేత జాతీయుల ఓట్లను నమ్ముకొని ఉన్నాడు ట్రంప్. ట్రంప్ ఇప్పుడు గెలవాలంటే... తన ఓట్లను పెంచుకోవడంతోపాటుగా అవతలి వర్గం ఓట్లను చీల్చగలగాలి.

కాన్యే వెస్ట్ 2018లో ట్రంప్ ని కలిసినప్పుడు జైళ్లను సంస్కరించడానికి భారీ విరాళాన్ని ఇచ్చాడు. ట్రంప్ కు అనుకూలంగా పలుమార్లు మాట్లాడాడు. బహిరంగ వేదికలపై ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ట్రంప్ వర్గం వారు  క్యాపులను కూడా ధరించాడు. ఇక దానికి తోడు ఎలోన్ మస్క్ సపోర్ట్ అన్ని చూస్తుంటే... నల్ల జాతీయుల ఓట్లను చీల్చేందుకు ట్రంప్ పన్నాగం పన్నుతున్నాడా అని అనిపిస్తుంది.

ఇప్పటికే కాన్యే వెస్ట్ ఇండిపెండెంట్ కాండిడేట్ గా తన పేరును నమోదు చేసుకోవడానికి న్యూయార్క్ సహా కొన్ని రాష్ట్రాల్లో సమయం పూర్తయింది. కాబట్టి ఆయన నిలబడలేడు అని కొందరు వాదిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏదైనా చిన్న పార్టీ తరుఫున నిలబడ్డా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కాన్యే వెస్ట్ గనుక నిలబడితే.... అతడు డెమొక్రాట్లకు పడాల్సిన నల్ల జాతీయుల ఓట్లను చీల్చగలుగుతాడని రిపబ్లికన్స్ ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు కాన్యే వెస్ట్ ని ఎవ్వరు నమ్మకపోవచ్చు. కానీ దాన్ని చూపెట్టి ట్రంప్ బలంగా వైట్ వర్సెస్ బ్లాక్ అని ప్రచారం నిర్వహించి గెలవాలని భావిస్తున్నాడు.

ఈ పరిస్థితులను చూస్తుంటే.... మన భారతీయ రాజకీయ పరిస్థితులకు చాలా దగ్గరి పోలికలు మనకు కనబడుతాయి. ప్రత్యర్థుల ఓట్లను చీల్చడానికి రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు మనకు తెలియనివి కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు ఉదాహరణలు పరిశీలిస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తన వ్యతిరేక ఓట్లను చీల్చడానికి బీజేపీని వాడుకున్నాడు. అంటి కేసీఆర్ వోట్ అంతా కేవలం కాంగ్రెస్ వైపునకు మాత్రమే వెళ్లకుండా జాగ్రత్తపడ్డాడు. ఒకపక్క బిఎల్ఎఫ్ మరోపక్క బీజేపీ ఇలా అనేక రకాలుగా వ్యతిరేక ఓట్లను చీల్చగలిగాడు. అది వర్క్ అవుట్ అయింది. కేసీఆర్ సఫలీకృతుడయ్యాడు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి  వస్తే వైసీపీ సైతం పవన్ కళ్యాణ్ పదే పదే ఇదే విషయంలో టార్గెట్ చేసింది. పవన్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రధాన ప్రతిపక్షంగా  జనసేనను నిలబెట్టి వైసీపీ ఓట్లను చీల్చడానికి  అని ఆరోపించారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ కాలేకపోయాడు. ప్రభుత్వ వ్యతిరేక వోట్ అంతా కూడా వైసీపీ వెనుకే నడిచింది.

ఇక్కడ ఇప్పుడు అమెరికాలో సైతం ఇలా ట్రంప్ వ్యతిరేక ఓట్ చీలుతుందా అనేది ఒక ఆసక్తికర అంశం. జైళ్లకు విరాళాలు ఇవ్వడంతోపాటుగా నల్ల జాతీయులకోసం కొన్ని పనులనయితే చేసాడు కాన్యే వెస్ట్. పాపులారిటీ కూడా బాగానే ఉంది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అక్కడ సెంటిమెంట్లు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ జో బిడెన్ కి అనుకూలంగా మారకుండా ఉండడానికి ట్రంప్ ఈ విధంగా కాన్యే వెస్ట్ ను రంగంలోకి దించాడని అంటున్నారు. ట్రంప్ కి కాన్యే వెస్ట్ మద్దతుదారుడు కూడా!

ప్రస్తుతానికి ఒకవేళ కాన్యే వెస్ట్ ఎన్నికల బరిలో నిల్చున్నప్పటికీ... అతను ట్రంప్ ఓట్లలో కూడా కొంతమేర లాగేసుకునే ఆస్కారం కనబడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అక్కడ రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి. అక్కడ శ్వేతజాతీయులు, నల్ల జాతీయుల మధ్య గనుక గ్యాప్ పెరుగుతున్నట్టుగా గనుక ట్రంప్ ఒక సీన్ సృష్టించగలిగితే ట్రంప్  లాభపడతాడు.

కాన్యే వెస్ట్ ని సీరియస్ గా తీసుకోని వర్గం వారు కూడా ఉన్నారు. ఏదో ఇప్పుడు ప్రస్తుతం తన మ్యూజిక్ ఆల్బం ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉందని, మరో కంపెనీతో బ్రాండ్ ప్రమోషన్ గురించి ఒప్పందం చేసుకున్నాడని, అందుకోసమే పాపులారిటీకై పాకులాడుతూ ఇలా చేసాడని అంటున్నారు.  చూడాలి రానున్న కాలంలో కన్యే వెస్ట్ నిజంగా ఎన్నికల బరిలో నిలబడతాడో లేదా ఇది మరో పబ్లిసిటీ స్టంట్ గా నిలిచిపోతుందా అన్నది వేచి చూడాలి.

loader