బాబోయ్.. పాములతో మసాజ్.. ఆ స్పా స్పెషలిటీ అదే.. !!
పాము కనిపిస్తే చాలు అంత దూరం పరిగెడతాం. అదెక్కడో బుస కొడితే.. ఇక్కడ పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక అది అనుకోకుండా శరీరం మీద పాకిందంటే బాబోయ్.. బతికుండగానే నరకదర్శనం అవుతుంది. అయితే కొంతమంది దీనికి మినహాయింపు.. స్నేక్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లు పాముల్ని పట్టుకోవడమే కాదు ముద్దు చేస్తారు.. ఒంటి మీద వేసుకుని గారాలు పోతారు.వారిని చూసినా సరే ఒళ్ల జలదరిస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ స్పా అదీ పాములో మసాజ్ అక్కడ స్పెషల్..
పాము కనిపిస్తే చాలు అంత దూరం పరిగెడతాం. అదెక్కడో బుస కొడితే.. ఇక్కడ పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక అది అనుకోకుండా శరీరం మీద పాకిందంటే బాబోయ్.. బతికుండగానే నరకదర్శనం అవుతుంది.
అయితే కొంతమంది దీనికి మినహాయింపు.. స్నేక్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లు పాముల్ని పట్టుకోవడమే కాదు ముద్దు చేస్తారు.. ఒంటి మీద వేసుకుని గారాలు పోతారు.వారిని చూసినా సరే ఒళ్ల జలదరిస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ స్పా అదీ పాములో మసాజ్ అక్కడ స్పెషల్..
ఆశ్చర్య పోతున్నారా? ఇది నిజంగా నిజం ఈజిప్టులోని ఈ స్పా స్పెషాలిటీ అదే.. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శరీరానికి చక్కటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి అలుపు తీర్చడానికి స్పా కు వెడుతుంటాం. ఇక్కడ వివిధ రకాల తైలాలతో మర్ధనా చేస్తూ కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా స్పా నిర్వాహకులు సరికొత్త టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు.
అయితే ఈజిప్టులోని కైరోలో గల ఓ స్పా సెంటర్ మాత్రం పాములతో బాడీ మసాజ్ చేస్తూ వినూత్నంగా నిలిచింది. ఈ ప్రక్రియ ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండవచ్చంటున్నారు నిర్వాహకులు.
తమ స్పాలో కొండచిలువలు సహా వివిధ రకాల విష రహిత పాములను ఉపయోగిస్తూ కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం గురించి స్పా యజమాని సఫ్వాట్ సెడికి మాట్లాడుతూ.. ‘స్నేక్ మసాజ్’తో కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని, దీనితో రక్తప్రసరణ కూడా మెరుగు అవుతుందని పేర్కొన్నారు.
‘‘శారీరకంగా, మానసికంగా ఉల్లాసం అందించడమే ఈ మసాజ్ ముఖ్యోద్దేశం. రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని ఉత్తేజితం అవుతుంది. ఎండార్ఫిన్ల విడుదలతో మానసిక సంతోషం కలుగుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
నిర్వాహకులు ఎన్నైనా చెబుతారు కస్టమర్లు ఏమంటున్నారు అంటే.. వాళ్లూ ఇది బాగుందని ఓటేస్తున్నారు.
ఓ కస్టమర్ మాట్లాడుతూ.. ‘‘నా శరీరంపై పాములను వేయగానే ఫస్ట్ కాస్త భయం వేసింది. కానీ నెమ్మదిగా భయం, టెన్షన్ మాయమయ్యాయి. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. నా వీపు మీద పాములు పాకుతూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం’’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.
ఇక స్నేక్ మసాజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందించగా.. చాలా మంది.. ‘‘అమ్మ బాబోయ్.. పాములు మీద పాకితే ఇంకేమైనా ఉందా. భయంతో గుండె ఆగిపోయినా ఆగిపోతుంది’’ అంటూ భయం వ్యక్తం చేస్తున్నారు.