MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • ఈ ట్రంప్‌ పుణ్యామాని.. భారతీయులు 'నెల తక్కువ వెధవలు' అవుతున్నారు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం కాదేమో.

ఈ ట్రంప్‌ పుణ్యామాని.. భారతీయులు 'నెల తక్కువ వెధవలు' అవుతున్నారు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం కాదేమో.

'నెల తక్కువ వెధవా' తెలుగులో ఓ తిట్టు ఉంది. అయితే నెలలు నిండక ముందు పిల్లలు భూమిపైకి వస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒకప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో పిల్లలు నెలలు నిండకు ముందు పుడితే ఓ అర్థముంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఇంతలా మారిన ఈ రోజుల్లో, అది కూడా అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ఈ పరిస్థితి నెలకొనడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. దీనంతటికీ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ కారణం అంటే నమ్ముతారా.? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..   

4 Min read
Author : Amarnath Vasireddy
| Updated : Jan 28 2025, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఫిబ్రవరి 20 నుంచి అమెరికా లో పుట్టే పిల్లల విషయం లో ట్రంప్ ఒక ఆర్డర్ జారీ చేశాడు . దీని పై ఇప్పుడు  జడ్జి .. స్టే జారీ చేశాడు . స్టే జారీ కాక ముందు విషయం . ఈ ఆర్డర్ ప్రకారం తల్లితండ్రుల్లో ఒకరు కేవలం తాత్కాలిక  స్టే పై ఉంటే..  గతంలోలా...  ఆ నేలపై పుట్టే బిడ్డ కు సహజంగా అమెరికా పౌరసత్వం దక్కదు . దీంతో  అక్కడ ఉంటున్నవారు ... "ఏడో నెల ... ఎనిమిదో నెల అయినా పరవాలేదు .. సిజేరియన్ చేసి బిడ్డ ను ఫిబ్రవరి 19 లోగా తీసెయ్యండి" అని ఆసుపత్రులకు వెళుతున్నారట .

తెలుగులో ఒక తిట్టుంటుంది . "నెల తక్కువ వెధవా"  అని . ఆ రోజుల్లో శాస్త్రం అభివృద్ధి చెందక పోయినా పరిశీలన ద్వారా చాల విషయాలు కనిపెట్టారు. తొమ్మిది నెలలు నిండకుండా శిశువును ఇలా బయటకు తీస్తే ఆ బిడ్డకు ... ఆటిజం..  ఏడీహెచ్ది...  బలహీనమయిన ఇమ్మ్యూనిటి ... ఆస్తమా...  డయాబెటిస్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలొచ్చే ప్రమాదముంది . తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం . చచ్చినా పర్లేదు .. అమెరికా గ్రీన్ కార్డు వస్తే చాలు అనుకొనేవారిని చూస్తే...  ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం కాదేమో అనిపిస్తుంది . ఎంత అప్డేట్ చేసుకొన్నా తెలిసింది గోరంత .. తెలియాల్సింది కొండంత...  అన్నట్టుంది పరిస్థితి. . 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మొన్న మలేషియాలోని మా కజిన్ ... "మలేషియా... ఆస్ట్రేలియా లోని అమ్మాయిల్లో సగానికి పైగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడం లేదు" అని వాట్సప్ లో చెప్పింది. సెక్స్ శారీరిక అవసరం . అందునా 20 - 40  వయసులో ఇది గరిష్టంగా ఉంటుంది . పెళ్లి చేసుకుంటేనే ... లేదా కనీసం బాయ్ ఫ్రెండ్ ఉండి వారు లివ్ ఇన్ లో ఉంటే ... సెక్స్ అవసరం తీరుతుంది ." బాయ్ ఫ్రెండ్ కూడా వద్దు అంటున్నారు" అని చెప్పింది మా కజిన్ . మరి ఇన్ని వేల మంది అమ్మాయిలు సెక్స్ అవసరాన్ని ఎలా తీర్చుకొంటున్నారు ? ఈ విషయం పై శోధిస్తే కొత్త లోకం ఒకటి కనిపించింది. అదే సెక్స్ టాయ్స్ . ఎప్పటినుంచో దీని గురించి తెలుసు. కానీ ఆన్లైన్ షాపింగ్ పుణ్యమా అంటూ ఇండియాలో కూడా ఇది లక్షల బిజినెస్ అయ్యిందని నిన్ననే తెలుసుకున్నాను.

సెక్స్ టాయ్స్ ఎవరు కొంటున్నారు?  అని కాదు ఇప్పుడు అడగాల్సింది . 25 - 35  వయసున్న వారి లో ఎంత మంది ఇంకా కొన లేదు? అని అడగాలి. అమ్మాయిలు పెళ్లి వద్దు అనడానికి తల్లితండ్రులు ఒక ముఖ్యమైన కారణం . తల్లితండ్రుల కీచులాట సంసారం చూసిన పిల్లలు .. తమకు ఈ జంజాటం ఎందుకు అనుకుంటున్నారు. "మీ మేనత్త దొంగ ము ...  మీ తాత  అవ్వ రాక్షసులు"..   అని పిల్లల చెవిలో జోరీగలా హోరెత్తించే తల్లులు .. ఎదిగిన బిడ్డ ముందే పెళ్ళాన్ని కొట్టే తండ్రులు.  "హోమ్ వర్క్ ఇచ్చారా ? బుక్ తియ్యి .. ఎన్ని మార్కులు వచ్చాయి? . తొంబై ఎనిమిది అంటున్నావు సిగ్గు లేదా నూటికి  నూరు ఎందుకు రాలేదు?" ఆరో తరగతి నుంచి ప్రతి రోజు...  సగటు తెలుగు ఇంట్లో వినిపించే మద్దెల దరువు. 
 

34

పండగలు,  పబ్బాలు లేక...  బంధువుల ఇళ్లకు  వెళ్లక.. ఐఐటీ సీట్ అటు పై...  గ్రీన్ కార్డు... ఇదే ఈ జన్మకు లక్ష్యం అని పెరిగిన పిల్లలు. ఇంత టార్చర్ భరించి కస్టపడి ఉద్యోగం సంపాదించాక    జాబ్...  శాలరీ...  ఈ రెండో లోకంగా కనిపిస్తుంది అంటే తప్పెవరిది ? "పెళ్ళొద్దు .. మీరు చస్తే ఏజెన్సీ కి డబ్బులిస్తే వారు వచ్చి ఏడ్చి పాడేకట్టి సాగనంపుతారు . అందాకా ఇదిగో నెలకు ఇంత అని ఇస్తా . ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండు" అని చెప్పే కొడుకు కూతురు కాక మరి ఎలాంటి వారు తయారవుతారు ? చేసుకున్నవారికి చేసుకున్నంత.

జనాల్లో వస్తున్న మార్పులను గమనించి దాన్ని కాష్ చేసుకొనే వారెందరో ! గంజాయి షాప్స్ .. మగ సెక్స్ వర్కర్స్.. మానసిక వైద్యులు .. వృద్ధాశ్రమాలు,  క్యాన్సర్ ఆసుపత్రులు,  ఆటిజం,  థెరపీ కేంద్రాలు,  విడాకుల లాయర్లు, కాంట్రాక్ కిల్లర్స్  .. రానున్న రోజుల్లో మూడు పూవులు ఆరుకాయలుగా వెలుగొందనున్న వృత్తులు / వ్యాపారాలు. కేరళలో పదకొండో తరగతి విద్యార్థి ప్రిన్సిపాల్ ను అతని ఛాంబర్లోనే...  తన సెల్ ఫోన్ ఇవ్వకపోతే బయట చంపేస్తానని బెదిరించాడు . అతని చేత బలవంతంగా సారీ చెప్పించి విషయాన్ని ముగించేశారట. పైగా వీడియో బయట పెట్టడం తప్పు అని ప్రిన్సిపాల్ కే చీవాట్లట.

సెల్ ఫోన్ దారుణాలు మితిమీరుతున్నా...  తల్లితండ్రులు టీచర్స్ ప్రభుత్వాలు .. అది అసలు సమస్యే కాదని ప్రవర్తిస్తున్నాయి. ఓ కార్పొరేట్ కాలేజీ  విద్యార్థి నేరుగా క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లి కిందకు దూకి మరణించాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది . ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి . కానీ వారి  అడ్మిషన్స్ కు  ఏమీ డోకా ఉండదు . తల్లితండ్రులకు  చీమ  కుట్టినట్టు అయినా ఉండదు . ఆత్మహత్యల కాలేజీలో చేర్పించారు సరే .. ఇలాంటి ఘటనలు  జరిగినప్పుడైనా.."  బాబు / అమ్మా.. ఒత్తిడికి గురి కాకు .. చదివినంత వరకు చదువు...  ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు..."  అని కనీసం తల్లితండ్రి చెప్పారా ?
 

44

అయినా నా పిచ్చి గానీ ... మా స్లేట్ తిరుపతిలో గత సంవత్సరం ఏడో తరగతి లో ముగ్గురు విద్యార్థులు టీసీ తీసుకొన్నారు . "మా పిల్లలు బాగానే చదువుతున్నారు . కానీ మీరు ఒత్తిడి తీసుకొని రావడం లేదు . ప్రెషర్ పెడితేనే చదువు"  అంటూ వారు .. తమ పిల్లల్ని కార్పొరేట్ లో చేర్పించారు. మా అమ్మాయిని రాచి రంపాన  పెట్టి అయినా.  ఎలాగైనా ఐఐటీ సీట్ కొట్టేలా చేయండి " అని తల్లితండ్రులే అంటే ఇక వారికి అడ్డు చెప్పేవారు ఎవరు ? అదే తిరుపతి లో గత సంవత్సరం పది చదివి...  ఇప్పుడు కార్పొరేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు మొన్న కలిశారు ." సార్ అమ్మాయి అని కూడా చూడకుండా క్లాసులో లెక్చరర్స్  బూతులు మాట్లాడుతారు . మూసుకొని కూర్చోండి . క్లాస్ బయటకు దె.. యండి .. ఇలాంటి మాటలు అక్కడ సహజం అని కన్నీళ్లు పెట్టుకొన్నారు .

పిల్లాడు ఓటిటి చూసి .. బూతులు నేర్చుకొంటే ముందుగా అమ్మను అబ్బను ... అమ్మనా బూతులు తిడుతాడు . అటు పై బడి లో టీచర్స్ ను తోటి విద్యార్థుల్ని ..  ఓటిటి బూతుల్లో పెరిగే బుల్లి రాజు కు నాన్నంటే ప్రేమ...  నాన్నను ఎవరైనా ఏదైనా అంటే సహించడు  అనే    కృత్రిమ బూతు హాస్యానికి పడిపడి నవ్వి ... పిల్లాడు బూతులు   నేర్వడం మోడరన్ ట్రెండ్"  అనుకొనే తల్లితండ్రులకు ... తమ జీవితాల్లో సంక్రాంతి దీపావళి రాదు .. వచ్చేది సునామి అని తెలియడానికి ఎక్కువ కాలం పట్టదు .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
మహిళలు
ప్రపంచం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ
Recommended image2
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Recommended image3
Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved