Yoga Day 2022: ప్రశాంతంగా నిద్రపట్టాలా..? ఈ యోగాసనాలు ప్రయత్నించండి..!
ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఈ విషయం తెలుస్తుంది. చిన్న పిల్లలు నెలల వయసులో ఉన్నప్పుడు ఇలానే పడుకుంటారు.

యోగా చేయడం వల్ల..చాలా ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలుసు. అయితే.. ఈ యోగా చేయడం వల్ల మనకు ప్రశాంతంగా నిద్రపడుతుందట. ఎవరైతే సరిగా నిద్రపట్టక.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో.. వారు ఈ యోగాసనాలు వేయాలట. మరి ఆ యోగాసనాలేంటో ఓసారి చూద్దామా..
child pose yoga
1.చైల్డ్ పోస్..
దాదాపు అందరూ ఆఫీసుల్లో చైర్లలో కూర్చొని వర్క్ చేస్తున్నవారే. అలా వర్క్ చేయడం వల్ల వెన్ను నొప్పి రావడం చాలా సహజం. ఆ నొప్పిని తట్టుకోవడానికి.. ఈ చైల్డ్ పోస్ ఉపయోగపడుతుంది.
ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఈ విషయం తెలుస్తుంది. చిన్న పిల్లలు నెలల వయసులో ఉన్నప్పుడు ఇలానే పడుకుంటారు. ఈ చైల్డ్ పోస్ లో మూడు నుంచి 5 నిమిషాల పాటు ఉండాలి. ఈ యోగాసనం వేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
2.Reclined butterfly
నార్మల్ గా.. యోగా లో బటర్ ప్లై ఆసనం గురించి తెలిసే ఉంటుంది. రెండు కాళ్లను సీతాకోక చిలుక రెక్కల్లా ఆడిస్తారు. అయితే... ఈ రెక్లైండ్ బటర్ ఫ్లై ఆసనంలో.. పడుకొని చేస్తారు. అంతే తేడా. ఈ ఆసనం కూడా.. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ఊపిరి పై పట్టు ఉంచాలి. ఊపిరి పీలుస్తూ.. వదులుతూ ఉండాలి.
3.బ్రిడ్జ్ ఫోస్..
ఈ బ్రిడ్జ్ ఫోస్ కూడా.. ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. దీనికి ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత.. రెండు కాళ్లను మడత పెట్టాలి. తర్వాత.. నడుమును పైకి ఎత్తి కొన్ని సెకన్ల పాటు ఉండాలి. ఇలా తరచూ చేయడం వల్ల కూడా రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
Shavasana
4.శవాసన..
ఇది వేయడం చాలా సులభం. దీనిలో ప్రశాంతంగా పడుకుంటారు. అయితే.. అలా పడుకునే సమయంలో.. రెండు అర చేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. కాలి వేళ్లు సైతం.. ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. తల నిటారుగా ఉంచాలి. ఈ ఆసనం వేయడం వల్ల కూడా.. ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపడుతుంది.