YogaDay 2022: ప్రతిరోజూ యోగా ఎందుకు చేయాలి..? ప్రాముఖ్యత ఏంటి..?
యోగా ని ప్రతిరోజూ చేయడం వల్ల.. శరీరం ఫ్లెక్సిబుల్ గా మారడంతో పాటు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మేథో శక్తిని పెంచుతాయి. థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్ వంటి ఎన్నో సమస్యలకు ఈ యోగా పరిష్కారం చూపిస్తుంది.

Yoga Health-
ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి అనుకుంటే.. వారి జీవితంలో యోగా కూడా ఒక భాగం అవ్వాలి. యోగా చేయడం వల్ల.. మనలో ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోగలం.
Yogasanas
యోగా ని ప్రతిరోజూ చేయడం వల్ల.. శరీరం ఫ్లెక్సిబుల్ గా మారడంతో పాటు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మేథో శక్తిని పెంచుతాయి. థైరాయిడ్, పీసీఓడీ, పీసీఓఎస్ వంటి ఎన్నో సమస్యలకు ఈ యోగా పరిష్కారం చూపిస్తుంది.
కాగా.. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడం గమనార్హం.
ఈ రోజున ప్రజలు తమ సమీపంలోని ఏదో ఒక ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకొని.. సామూహికంగా యోగాసనాలు వేస్తారు. యోగా వలన కలిగే అనేక ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రతిరోజూ యోగా సాధన మీ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది శాంతియుతమైన శరీరం , మనస్సును సాధించడానికి సహాయపడుతుంది. దీని వల్ల ఒత్తిడి సమస్యలు కూడా తగ్గుతాయి. యోగా చేయడం వల్ల రోజంతా రిలాక్స్ గా ఉన్న భావన కలుగుతుంది. శరీరంలో పెరిగిన కొవ్వను కరిగించడానికి కూడా యోగా సహాయం చేస్తుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్ర:
2014 సెప్టెంబరు 27న UN జనరల్ అసెంబ్లీ (UNGA)లో తన ప్రసంగంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి మొదటిసారిగా ప్రతిపాదించారు. డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం లేదా ప్రపంచ యోగా దినోత్సవంగా దీనిని పిలుస్తున్నాం.
2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.