బొప్పాయి తిన్న తర్వాత వీటిని తింటే మీ పని అంతే..!
బొప్పాయి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ దీన్ని తిన్న తర్వాత కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. తిన్నారంటే జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
papaya
బొప్పాయిని తింటే మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. నిజానికి ఈ పండు మన పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపు పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎన్నో చర్మ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు ఇది మీ కడుపును చల్లబరచడంతో పాటుగా మలబద్ధకం, పైల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే బొప్పాయి తిన్న తర్వాత కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. అవేంటంటే..
Image: Getty Images
బొప్పాయి తిన్న తర్వాత పాలు తాగాలా?
బొప్పాయిని తిన్న తర్వాత పాలను తాగకూడదు. ఎందుకంటే బొప్పాయి, పాలు రెండూ కలిసి మలబద్దకం లేదా కడుపు నొప్పికి దారితీస్తాయి. ఇది అకస్మాత్తుగా అజీర్ణం, ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి బొప్పాయిని తిన్న తర్వాత పాలు తాగడం మానుకోండి.
బొప్పాయి తిన్న తర్వాత టీ తాగాలా?
బొప్పాయిని తిన్న తర్వాత టీ తాగడం వల్ల పాపైన్ ఎంజైమ్ తో రియాక్ట్ అవుతుంది. ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటుగా టీ ఆకులలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి పాపైన్ సమ్మేళనంతో కలిసి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి.
బొప్పాయి తర్వాత గుడ్డును తినొచ్చా?
బొప్పాయిని తిన్న తర్వాత గుడ్లను అసలే తినకూడదు. బొప్పాయి విటమిన్ సి, పాపైన్ ఎంజైమ్లతో సమృద్ధిగా ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్, ఒమేగా -3 ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల మీ కడుపు గందరగోళానికి గురవుతుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు అనారోగ్యానికి గురి చేస్తుంది. అజీర్ణం, వికారం, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
curd
బొప్పాయి తిన్న తర్వాత పెరుగు తినాలా?
బొప్పాయి తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఆయుర్వేదం దృష్ట్యా బొప్పాయి వేడిగా.. పెరుగు చాలా చల్లగా ఉంటుంది. అందుకే వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయి తిన్న తర్వాత నిమ్మకాయ తినొచ్చా?
బొప్పాయి, నిమ్మకాయ కలిసి మీ శరీరంలో హిమోగ్లోబిన్ లోపానికి కారణమయ్యే టాక్సిక్ సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. దీంతో మీ శరీరంలో రక్తం తగ్గుతుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే బొప్పాయిని తిన్న తర్వాత వీటిని తినడం మానుకోండి.