కాఫీ తాగడం మానేస్తే మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?
కాఫీ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా కాఫీని తాగుతుంటారు. మీకు రోజూ కాఫీ తాగే అలవాటుంటే.. మీరు కాఫీని తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాఫీకి అలవాటు పడిన వారు దీన్ని తాగకుండా అస్సలు ఉండలేరు. కాఫీ నిద్రమబ్బును వదిలించి మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. నిజానికి కాఫీని తాగడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. కాఫీ అలవాటు ఉన్నవారు దీన్ని మానేస్తే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? పదండి ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం..
కాఫీ మానేస్తే ఏం జరుగుతుంది?
మీరు కాఫీని తాగడం మానేస్తే అలసట, తలనొప్పి, చిరాకు, ఏకాగ్రతలో ఇబ్బందులు ఇట్టే దూరమవుతాయి. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ మన శరీరం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు దీనిని మానేసినప్పుడు ఈ సమస్యలు ఆటోమెటిక్ గా దూరమవుతాయి.
మంచి నిద్ర
కాఫీ మీకు కొద్దిసేపటి దాకా ఎనర్జీని ఇస్తుంది. అయితే ఇది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అయితే మీరు కాఫీ తాగడం మానేసినప్పుడు మీకు బాగా నిద్రపడుతుంది. అలాగే మీరు రాత్రంతా కంటినిండా నిద్రపోగలుగుతారు. ఎందుకంటే కెఫిన్ మీ శరీరంలో గంటల తరబడి ఉండి మీ సహజ నిద్ర-మేల్కొలుపు చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
పెరిగిన శక్తి
కాఫీని మానేయడం వల్ల దీర్ఘకాలికంగా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీ అలవాటు వల్ల దీనిని మానేసిన మొదట్లో మందకొడిగా, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అయినప్పటికీ దీనికి మీ శరీరం అలవాటు పడి రోజంతా మీ ఎనర్జీ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుంది.
మంచి జీర్ణక్రియ
కాఫీని ఎక్కువగా తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. మీరు కాఫీని తగ్గిస్తే మీ జీర్ణక్రియ, మొత్తం గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిజానికి కొంతమంది కాఫీ తాగడం ఆపివేసిన తర్వాత వారి కడుపు సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.