చక్కెరను తగ్గించి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది
చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ సంగతి తెలిసినా చాలా మంది చక్కెరను ఎక్కువగానే తింటుంటారు. మీరు గనుక చక్కెరను తగ్గించి చూడండి. ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు..
టీ, కాఫీ, బయటి ఫుడ్, ఇంట్లో ఫుడ్ ఇలా ఎన్నో మార్గాల్లో చక్కెరను తింటూనే ఉంటారు. కానీ ఎక్కువ చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మనలో చాలా మందికి ప్రతిరోజూ ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీ, కాఫీల్లో షుగర్ కచ్చితంగా ఉంటుంది. అయితే మీరు ఒక వారం లేదా 10 రోజుల పాటు ఈ చక్కెరను పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అసలు చక్కెరను తగ్గించడం వల్ల మీ శరీరంలో వచ్చే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
శరీరానికి శక్తి
మీరు బాగా గమనిస్తే.. చక్కెరను తగ్గించడం వల్ల మీ శరీర శక్తి పెరుగుతుంది. అవును చక్కెర మీ శరీరంలోని శక్తిని త్వరగా తగ్గిస్తుంది. దీనివల్ల మీకు అలసటగా, మందకొడిగా అనిపిస్తుంది. మీరు గనుక చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే.. రోజంతా మంచి ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే శారీరక శక్తి హెచ్చు తగ్గులు కూగా తగ్గుతాయి.
బరువును తగ్గిస్తుంది
చక్కెరలో కేలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకుంటే మీరు బరువు విపరీతంగా పెరిగిపోతారు. మీరు చక్కెరను తగ్గిస్తే మొత్తం కేలరీలు తీసుకోవడాన్ని తగ్గించొచ్చు. అలాగే బరువు కూడా తగ్గొచ్చు. చక్కెరను ఎక్కువగా తీసుకుంటే మీ ఆకలి పెరుగుతుంది. దీంతో మీరు విపరీతంగా తింటారు. కాబట్టి చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే మీ ఆకలి బాగా నియంత్రణలో ఉంటుంది.
Image: Freepik
మెరుగైన జీర్ణక్రియ
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే మీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, ఇతర జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది. అందుకే మీరు చక్కెరను తగ్గిస్తే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపునకు సంబంధించిన వ్యాధుల లక్షణాలు కూడా తగ్గుతాయి. చక్కెర ముఖ్యంగా మైక్రోబయోమ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది ఎందుకంటే ఇది గట్లోని హానికరమైన బ్యాక్టీరియాకు ఆహారం ఇస్తుంది.
Image: Getty Images
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో మంట పెరుగుతుంది. అలాగే మొటిమలు, దురద, చర్మశోథ, అకాల వృద్ధాప్యం వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. మీరు చక్కెరను తగ్గిస్తే మీ చర్మం రూపం మెరుగుపడుతుంది. మీ రంగు స్పష్టంగా, ప్రకాశవంతంగా, చర్మం యవ్వనంగా మారుతుంది.
Image: Getty Images
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం చాలా పెరుగుతుంది. మీరు చక్కెరను తగ్గిస్తే ఈ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. డయాబెటిస్ లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు చక్కెరను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.