పాలు తాగిన వెంటనే నీళ్లు తాగొచ్చా?
మనలో చాలా మందికి పాలు తాగిన వెంటనే నీళ్లను తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగొచ్చా? తాగితే ఏమౌతుంది? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాలలో మన శరీరానికి అవసరమై ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇకపోతే నీళ్లు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. పాలు, నీళ్లు రెండూ మన శరీరానికి చాలా అవసరం. ఈ రెండూ మన బాడీని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అయితే కొంతమంది పాలు తాగిన వెంటనే నీళ్లను తాగుతుంటారు. అసలు ఇలా తాగొచ్చా? తాగితే ఏమన్నా అవుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాలు తాగిన వెంటనే నీళ్లు తాగాలా?
చాలా మంది పాలు తాగిన వెంటనే నీళ్లను తాగేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే?
జీర్ణక్రియ దెబ్బతినొచ్చు
వేడి వేడి పాలను తాగిన వెంటనే చల్లని నీళ్లను తాగితే మన జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. పోషకాల శోషణ, జీర్ణక్రియ సరిగ్గా ఉండాలంటే మీరు వేడి పాలు తాగిన వెంటనే నీళ్లను తాగడం మానుకోండి.
జీవక్రియ మందగించొచ్చు
పాలు తాగిన వెంటనే నీళ్లను తాగితే మీ మెటబాలిజం బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ శరీరంలో ఎనర్జీ లెవల్స్ కూడా తగ్గడం మొదలవుతుంది. దీంతో మీరు అలసిపోయినట్టుగా భావిస్తారు.
ఉదర సమస్యలు
వేడి వేడి పాలు తాగిన వెంటనే మీరు నీళ్లు తాగితే కూడా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కానీయదు.
ఎసిడిటీ సమస్య
వేడి పాలు తాగిన వెంటనే నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ అలవాటు మీకు ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది. అలాగే అజీర్ణం, కడుపులో బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
దంతాల సమస్యలు
గోరువెచ్చని పాలను తాగి ఆ వెంటనే మీరు చల్లని నీళ్లను తాగితే మీ దంతాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇది దంతాలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంత సేపటి తర్వాత నీళ్లు తాగాలి?
పాలు తాగిన వెంటనే నీళ్లు తాగితే మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పాలు తాగిన 30 నుంచి 45 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లను తాగండి. ఇది మీ శరీరానికి ఎలాంటి హాని చేయదు.