బరువు తగ్గించే మందులను వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది బరువు తగ్గడానికి మందులను కూడా వాడుతుంటారు. అసలు ఈ మాత్రలు బరువును తగ్గిస్తాయా? వీటిని వేసుకోవడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
weight loss
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ ఊబకాయం ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది యువకులను, వృద్ధులను ఒకేలాగ ప్రభావితం చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడం ఇంపాజిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎంత డైటింగ్ చేసినా, వ్యాయామం చేసినా బరువు అస్సలు తగ్గరు. ఇలా మీరు బరువు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలోనే బరువును తగ్గించే మాత్రలు పుట్టుకొచ్చాయి. ఎలాంటి శ్రమ లేకుండా బరువును తగ్గిస్తాయనే సరికి చాలా మందికి వీటిని వాడుతున్నారు. అలాగే ఈ మాత్రలు ఆరోగ్యానికి మంచివేనా?
బరువు తగ్గించే మందులు అంటే ఏమిటి?
బరువు తగ్గించే మందులను.. మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని డైట్ పిల్స్ లేదా యాంటీ ఒబెసిటీ మెడిసిన్స్ అని అంటారు. ఈ మందులు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆకలిని తగ్గిస్తాయి. అలాగే కొవ్వు శోషణను నివారిస్తాయి. జీవక్రియను పెంచడంతో పాటుగా ఎన్నో విధాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గించే మందులు పని చేస్తాయా?
వెయిట్ ను తగ్గించే మందులు సహజంగా బరువు తగ్గలేని వ్యక్తులు వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది చాలా ఎఫెక్టీవ్ మార్గం అని నమ్ముతారు. ఈ మందులు తినడాన్ని తగ్గిస్తాయి. కొవ్వు శోషణను తగ్గించడం లేదా మీ జీవక్రియను పెంచి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎండోటెక్స్ట్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. బరువు తగ్గడానికి వేసుకునే మందులు మీ శరీర బరువులో 5-10 శాతం తగ్గడానికి సహాయపడతాయని కనుగొన్నారు. అయినప్పటికీ.. రెగ్యులర్ గా శారీరక శ్రమ చేస్తేనే మీరు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు తినే ఆహారం, మీ లైఫ్ స్టైల్ లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ వీటిని తీసుకుంటే మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి. ఇలా చేయడం వల్ల మీ బరువు తగ్గుతుంది. కానీ మీ లైఫ్ స్టైల్ మాత్రం బాగుండాలి.
బరువు తగ్గించే మాత్రల వల్ల వచ్చే సమస్యలు
మనం వాడే ఇతర మందుల మాదిరిగానే బరువు తగ్గించే మాత్రలు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మీరు వేసుకుంటున్న మందులను బట్టి మందుల దుష్ప్రభావాలు మారొచ్చు. బరువు తగ్గడానికి వేసుకునే మందులు కొన్ని సాధారణ లేదా ప్రమాదకరమైన సమస్యలను కలిగిస్తాయి. వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, కడుపు అసౌకర్యం, గుండె దడ, అధిక రక్తపోటు, ఫాస్ట్ గా గుండె కొట్టుకోవడం, నిద్రలేమి, ఆత్రుత, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.