జుట్టు పెరుగుదలకు కరివేపాకు ఎలా సహాయపడుతుందో తెలుసా?
కరివేపాకు (Curry leaves) ఇది లేకుండా భారతీయ మహిళలు వంటలు చేయడానికి ఇష్టపడరు. కరివేపాకును పోపులో వేయడంతో మంచి వాసన వస్తుంది. చాలామంది కరివేపాకులను రుచికోసం, వాసన కోసం వాడతారని మాత్రమే తెలుసు. అయితే కరివేపాకు ఆరోగ్యానికి చేసే మేలు గురించి సరైన అవగాహన ఉండదు. అందుకే భోజనం చేసే సమయంలో కరివేపాకు కనిపిస్తే దాన్ని పక్కన తీసి పెడుతుంటాం. కానీ కరివేపాకులలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వారికి తెలియదు. తెలిస్తే వాటిని వదలకుండా తినడానికి ఇష్టపడతారు. కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా చక్కగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ (Article) )ద్వారా కరివేపాకుతో జుట్టు సంరక్షణ ఏ విధంగా మెరుగుపడుతుందో తెలుసుకుందాం..

కరివేపాకు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తుంది. అయితే ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచి జుట్టు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ (Beta carotene) అనే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. తలలోని ఇన్ఫెక్షన్ (Infections) లను సైతం తగ్గించగల సామర్థ్యం కరివేపాకు ఉంది. అయితే ఇప్పుడు కరివేపాకు జుట్టుకు మేలు చేసే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జుట్టుకు ఔషధంగా పనిచేస్తుంది: ఒక గిన్నెలో కరివేపాకులను (Curry leaves), కొంచెం కొబ్బరి నూనెను (Coconu oil) తీసుకొని స్టవ్ మీద పెట్టి కరివేపాకు నల్లగా మారే వరకు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నా నూనెను వడగట్టి చల్లారిన తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. గంట తరువాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడంతో జుట్టు పెరుగుదల మెరుగుపడటంతో పాటు జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది. ఇది జుట్టుకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
దెబ్బతిన్న రూట్స్ ను రిపేర్ చేస్తాయి: తాజా కరివేపాకులను తీసుకుని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేసుకోవాలి. అరగంట తరవాత తలస్నానం చేయాలి. ఇది కలుషిత వాతావరణం (Polluted atmosphere), ఇతర కారణాలతో దెబ్బతిన్న రూట్స్ (Damaged Roots) ను మరమ్మతు చేసి జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అందించి దెబ్బతిన్న మూలాలను రిపేర్ చేస్తాయి. ఈ విధంగా జుట్టు వేగంగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది. నిర్జీవంగా మారిన జుట్టును తిరిగి కాంతివంతంగా మార్చి జుట్టు సంరక్షణను మెరుగుపరుస్తుంది
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: కరివేపాకులో అధిక మొత్తంలో ఉండే బీటా కెరోటిన్ ప్రోటీన్ జుట్టు నష్టాన్ని తగ్గిస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు కావల్సిన తేమను అందించి చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. తలలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను నశింపచేసి జుట్టు రాలడాన్ని (Hair fall) తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
జుట్టును మెరిసేలా చేస్తుంది: దీని కోసం కరివేపాకులను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న కరివేపాకు మిశ్రమంలో (Curry paste) పెరుగు (Curd) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలమాడు నుంచి జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా రెండు వారాల కొకసారి చేసినా జుట్టు నల్లగా, పట్టులా మెరుస్తుంది.