మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..!
మరి ఈ మానసిక ఆరోగ్యం పొందాలంటే.. మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూసేద్దామా..

మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ నూతన సంవత్సరంలో కొత్త సవాళ్లు,.. కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే.. ఈ న్యూ ఇయర్ లో.. మంచి ఆరోగ్యం దక్కాలని అందరూ కోరుకుంటారు.
అయితే.. శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. మరి ఈ మానసిక ఆరోగ్యం పొందాలంటే.. మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూసేద్దామా..
ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజునీ వ్యాయామంతో మొదలుపెట్టాలి. శారీరక శ్రమ చేయడం అంటే బరువు తగ్గడం కాదు, అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు వ్యాయామం చేసేటప్పుడు మీ మెదడు ద్వారా ఉత్పన్నమయ్యే సంతోషకరమైన అనుభూతులను మెరుగుపరుస్తుంది
మిమ్మల్ని మీరు యాక్టివ్‌గా ఉంచుకునేటప్పుడు మీ డైట్‌లో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. పౌష్టికాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారం ద్వారా మీ మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం.
ఇక.. ప్రతిరోజూ.. 6-8 గంటలపాటు నిద్ర చాలా అవసరం. నాణ్యమైన నిద్రను పొందినప్పుడే.. మనసు ప్రశాంతంగా.. ఆరోగ్యంగా ఉంటుంది. ఇక.. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు.. టీవీ, ఫోన్ లు వంటి వాటికి దూరంగా ఉండాలి. పడుకోవడానికి కనీసం అరగంట ముందు.. మనకంటూ మనం సమయాన్ని కేటాయించుకోవాలి.
స్వీయ-సంరక్షణపై దృష్టి పెట్టాలి. మీకంటూ మీరు సమయం కేటాయించడం అంటే.. కొందరికి.. చర్మం, జుట్టు సంరక్షణ ఇష్టం.. కొందరికి పుస్తకాలు చదవడం ఇష్టం. ఇలా... ఒక అరగంట పాటు అలా మీకు నచ్చిన విషయంపై దృష్టి పెట్టాలి. అలా చేయడం వల్ల కూడా.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
mental
ఆఫీసు పనులతోపాటు.. మీకు నచ్చిన కొన్ని పనులు కూడా చేసేలా టైమ్ షెడ్యూల్ చేసుకోవాలి. మీకు నచ్చిన పని చేయడం వల్ల ఒత్తిడి సమస్య ఎక్కువగా ఉండదు... మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.