ఉదయం ఈ పని చేస్తే తొందరగా లావు తగ్గుతారు..
రోజు రోజుకు ఊబకాయుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ ఊబకాయం గుండెపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అయితే ఉదయం కొన్ని పనులు చేస్తే ఊబకాయం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

obesity woman
ఫిట్ గా, హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. తింటున్న ఫుడ్, మనం చేసే వర్క్, శరీరక శ్రమ వంటివి మన బరువును నిర్ణయిస్తాయి. ప్రస్తుత కాలంలో అధిక బరువు, ఊబకాయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే స్థూలకాయాన్ని తగ్గించడానికి మనం తినే ఆహారంతో పాటు కొన్ని అలవాట్లు కూడా సహాయపడతాయంటున్నారు నిపుణులు. బరువు పెరగడం చాలా సులభం. కానీ దానిని తగ్గించడం చాలా కష్టం. సరైన ఆహారం, వ్యాయామంతో బరువును తగ్గొచ్చు. అయితే పొద్దున కొన్ని పనులు చేస్తే కూడా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలి
స్థూలకాయానికి ప్రధాన కారణం మెటబాలిజం మందగించడం. జీవక్రియలను అదుపులో ఉంచుకోవాలంటే ఉదయం లేవగానే 1-2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. ఆయుర్వేదం ప్రకారం.. నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
వ్యాయామం చేయకుండా ఉండొద్దు
మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకు కనీసం 25 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తేలికపాటి వ్యాయామాలు మిమ్మల్ని చురుగ్గా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే డే స్టార్టింగ్ లోనే మీ శరీరానికి సరైన శక్తిని అందిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది జిమ్ కు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. మీకు ఇది కూడా చాలా సహాయపడుతుంది. మీకు జిమ్ కు వెళ్లే సమయం లేకపోతే ఇంట్లోనే ఉదయం తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది మిమ్మల్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
సూర్యరశ్మిలో నిలబడండి
విటమిన్ డి మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది చాలా చాలా అవసరం కూడా. ఉదయపు సూర్య కిరణాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి, మనస్సుకు సానుకూల శక్తిని ఇస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం ఎండ తగిలే ప్లేస్ లో చేయండి. అలాగే విటమిన్ డి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
breakfast
బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయొద్దు
బరువు తగ్గడానికని చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. నిజమేంటంటే.. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరం బలహీనంగా మారుతుంది. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల దీర్ఘకాలిక ఆకలి బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించి అతిగా తింటారు. అలాగే మీరు ఆకలితో ఉండటం వల్ల మీ శరీరంలో ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి.