యోగా పరగడపున మాత్రమే చేయాలా..? నిపుణుల సలహా ఏంటి?
మన శీరీరం కూడా అంత అనువుగా ఉండదు. జీవక్రియ కూడా దెబ్బ తింటుంది. కాబట్టి.. పరగడుపున కాకపోయినా.. చాలా తక్కువ లైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత చేయవచ్చు.

అనారోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా.. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ఉత్తమం. మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంతో పాటు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న యోగాని ఏ సమయంలో చేయాలి..? పరగడపున మాత్రమే చేయాలా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? యోగా పరగడుపున మాత్రమే చేయాలా..? లేక సాయంత్ర వేళ కూడా చేయవచ్చా..? సమాధానమేంటో తెలుసుకుందాం..
yoga
వ్యాయామం అనేది ఉదయాన్నే చేయడం ఆరోగ్యానికి మంచిదట. మిగిలిన సమయాల్లోనూ కూడా చేయవచ్చు.. కానీ.. పొట్ట బరువుగా.. ఎక్కువగా తిన్న తర్వాత సరిగా చేయలేం. మన శీరీరం కూడా అంత అనువుగా ఉండదు. జీవక్రియ కూడా దెబ్బ తింటుంది. కాబట్టి.. పరగడుపున కాకపోయినా.. చాలా తక్కువ లైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత చేయవచ్చు.
yoga
అసలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా చేయాలని రూల్ అయితే లేదు. తేలిక ఆహారం అంటే.... ఏదైనా పండు తిడం లేదంటే.. రెండు ఎండు ఖర్జూరాలు తినడం లాంటివి చేయాలి. ఇవి మీ జీవక్రియను మెరుగు పరిచి.. యోగా చేయడానికి శక్తిని అందజేసిన వారు అవుతారు.
Yoga
ఇక శ్వాసకు సంబంధించిన యోగాసనాలు చేస్తున్నప్పుడు.. పరగడుపున చేస్తేనే మంచిది. లేదంటే.. కడుపులోని ఆహారం బయటకు రావడం లాంటివి జరిగే ప్రమాదం కూడా ఉంది. ఆహారం తీసుకొని కనీసం గంట తర్వాత చేస్తే.. ఇలాంటి ఇబ్బంది ఉండదు.
yoga health tips
యోగా తో ఎక్కువ ప్రయోజనాలు పొందాలి అంటే మాత్రం.. పరగడుపున చేయడమే ఉత్తమమని నిపుణులు చేస్తున్నారు. ముఖ్యంగా శ్వాసను నియంత్రించే ఆసనాలు చేసే కమ్రంలో.. పొట్ట ఖాళీగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.