ఇలా చేస్తేనే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండవు..
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఎంత ట్రై చేసినా.. కొన్ని పనులు చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2024 నాటిని డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య 135 మిలియన్లకు పెరుగుతుందని సర్వేలు వెళ్లడిస్తున్నాయి.
ఈ డయాబెటీస్ ప్యాంకియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ప్యాంక్రియాస్ తయారుచేసిన ఇన్సులిన్ ను శరీరం ఉపయోగించకుంటే వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఈ డయాబెటీస్ నరాలను, రక్త నాళాలను దెబ్బతీస్తుంది.
అయితే కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రం తగ్గడం లేదని చెప్తుంటారు. అసలు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మందులను ఆపేయడం
డయాబెటీస్ కు మందులను కొన్ని రోజులు వేసుకోకున్నా ఏం కాదు. అయితే ఆ వ్యక్తి జీవన శైలి, ఆహారంపై మందులను వాడాలా? వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. తక్కువ శుద్ధి చేసిన కార్భోహైడ్రేట్, అధిక ప్రోటీన్, మితమైన కొవ్వులు, ఎత్తు, వయసుకు తగ్గ బరువు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీరు డయాబెటీస్ కు మందులను వాడకున్నా ఏం కాదు. ఎందుకంటే ఈ అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కానీ డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాలి. నిపుణుల ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నప్పటికీ మందులను ఉపయోగించాలి. ఎందుకంటే డయాబటీస్ వ్యక్తుల్లో ఇన్సులిన్ నిరోధకత, లేదా లోపం ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి, మందులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే మీ శరీరంలోని ఇన్సులిన్ కణాలను దెబ్బతీస్తాయి.
సన్నగా ఉన్నానని..
డయాబెటీస్ గురించి దీన్ని కూడా జనాలు గుడ్డిగా నమ్మేస్తుంటారు. సన్నగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని. కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. అధిక బరువు, ఊబకాయుల రక్తంలో మాత్రమే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయనుకోవడం పొరపాటు. ఎందుకంటే టైప్ 1, ఇతర డయాబెటీస్ లో ఎవ్వరి శరీరంలోనైనా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అంటే సాధారణ, సన్నగా ఉన్నవారిలో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే కండరాలు, శరీర కొవ్వు తగ్గడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కొలవకపోవడం
చాలా మంది డయాబెటీస్ లక్షణాలను అస్సలు గుర్తించరు. ఎందుకంటే ఇవి అంత తీవ్రమైనవిగా ఉండవు. అధిక దాహం, ఆకలి, తరచుగా మూత్రం రావడం, ఎక్కువ బలహీనంగా అనిపించడం వంటి కొన్ని లక్షణాలను డయాబెటీస్ ను గుర్తించొచ్చు. డయాబెటీస్ లక్షణాలను లైట్ తీసుకోకూడదు. మెడచుట్టూ చర్మం నల్లగా మారడం, అండర్ ఆర్మ్స్, గజ్జలు నల్లబడటం సర్వసాధారణం. డయాబెటీస్ పేషెంట్లకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఫోలిక్యులిటిస్ వంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
డయాబెటీస్ ఉన్నా నిర్లక్ష్యం
డయాబెటీస్ ఉన్నట్టు గుర్తించినా.. చాలా మంది మునపటిలాగే ఉంటారు. అంటే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. శారీరక శ్రమ చేయరు. కానీ డయాబెటీస్ ఉన్నా.. లేకున్నా.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండింటినీ కలుపుకుని వారానికి కనీసం 150 నిమిషాలన్నా చేయాలి. అయితే కండరాలు రక్తంలో చక్కెరను తీసుకుంటాయి. కానీ డయాబెటీస్ ఉన్నవారిలో ఈ ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. వ్యాయామం, జిమ్ చేయడం వల్ల కండర ద్రవ్యరాశి పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటీస్ హైపర్ టెన్షన్, ఇతర జీవన శైలి అనారోగ్యానికి కారణమయ్యే బెల్లీ ఫ్యాట్ ను వ్యాయామం తగ్గిస్తుంది.