జ్వరం లేకున్నా శరీరం వేడిగా ఉందా? కారణమిదే
చెడు ఆహారాలు, కొన్ని అనారోగ్య సమస్యలు, పర్యావరణ కారకాలు మన శరీరాన్ని వేడిగా చేస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ వేడిని తగ్గించుకోవచ్చు.
సాధారణంగా ఎండాకాలంలో మన శరీరం వేడిగా అనిపిస్తుంది. మండుతున్న ఎండలు, ఉక్కపోత వల్ల అలా అవుతుంది. ఈ వేడిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది సర్వ సాధారణం. అయితే కొంతమంది శరీరం కాలాలతో సంబంధం లేకుండా వేడిగా ఉంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఆడవారి బాడీ హీట్ బాగా పెరుగుతుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు, తప్పుడు ఆహారపు అలవాట్లు, పర్యావరణ కారకాలు కూడా బాడీ హీట్ ను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. శరీర వేడి ఎందుకు పెరుగుతుందో? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో? ఇప్పుడు తెలుసుకుందాం..
బాడీ హీట్ పెరగడానికి కారణాలు ఇవే..
శరీరంలో నీరు లేకపోవడం
ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం సర్వ సాధారణం. అయితే మీ శరీరం ఎప్పుడూ వేడిగానే ఉందంటే.. మీ ఒంట్లో నీరు లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. నిజానికి ఎయిర్ కండిషనర్ లో ఎక్కువ సేపు ఉండటం వల్ల శరీరానికి దాహం అవుతుందన్న సంగతి తెలియదు. దీని వల్ల శరీరంలో నీరు తగ్గిపోతూ ఉంటుంది. ఇది కాకుండా వెంటిలేషన్, సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల కూడా ఒంట్లో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. దీనివల్ల మీ శరీరం హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు గురవుతుంది.
హైపర్ థైరాయిడిజం
మన శరీరంలో అతి చురుకైన థైరాయిడ్ గ్రంథిని హైపర్ థైరాయిడిజం అంటారు. దీనివల్ల శరీరం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. దీనివల్ల విపరీతమైన చెమట పడుతుంది. అలాగే పదేపదే దాహం వేస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు బాగా అలసటకు గురవుతారు. పీరియడ్స్ సక్రమంగా రావు. అలాగే బరువు కూడా బాగా తగ్గిపోతారు.
Image: Freepik
ఎక్కువ ఒత్తిడి
ఒత్తిడికి బాగా గురైతే కూడా శరీరం వేడిగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమయ్యేవారు బాడీ హీట్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే తీరుపై ప్రభావం చూపి శరీరం వేడిగా మారుతుంది.
స్పైసీ ఫుడ్ ను తినడం
స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తినడం, ఆల్కహాల్ ను తాగడం, కెఫిన్ ను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కూడా బాడీ హీట్ బాగా పెరుగుతుంది. అలాగే ఇది మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది. అంతేకాదు చెమట కూడా పడుతుంది. శరీరం చల్లగా ఉండాలంటే మిరప, మసాలా దినుసులను ఎక్కువగా తినడం మానుకోండి.
శరీరాన్ని చల్లగా ఉంచే చిట్కాలు..
పండ్లు తినండి
బాడీ హీట్ తగ్గాలంటే వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటే పండ్లను తినండి. పుచ్చకాయ, టమాటాలు, దోసకాయలు వంటి పండ్లు, కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని మీ ఆహారంలో చేర్చండి. వీటిని తినడం వల్ల మీరు ఫ్రెష్ గా కనిపిస్తారు. అలాగే శరీరం వేడి కూడా తగ్గుతుంది. నిజానికి ఈ ఆహారాలు చల్లగా ఉంటాయి. ఇవి శరీర వేడిని తగ్గిస్తాయి.
మీ ఆహారంలో ఎలక్ట్రోలైట్లను చేర్చండి
శరీరంలో నీరు లేకపోవడం వల్ల బాడీ హీట్ పెరగడం మొదలవుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మీ ఆహారంలో లస్సీ, నిమ్మరసం, కొబ్బరి నీటిని చేర్చండి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపాన్ని పోగొడుతుంది.
వ్యాయామం
రెగ్యులర్ గా వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా మీ దినచర్యలో కొన్ని నోటి శ్వాస వ్యాయామాలను కూడా చేర్చండి. ఇది మీ ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో కూర్చోండి
శరీరాన్ని వేడెక్కకుండా రక్షించడానికి గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో కూర్చోండి. ఇది మీ శరీరాన్ని చల్లగా, రీఫ్రెష్ గా ఉంచుతుంది. సరైన వెంటిలేషన్ మీ శరీరాన్ని శ్వాస సమస్యల నుంచి కాపాడుతుంది.