Health Tips: ఇలాంటి లక్షణాలు ఉన్నాయా.. అయితే కిడ్నీ సమస్యలే?
Health Tips: కిడ్నీలో రాళ్లు అనేది భరించలేని బాధకి కారణం అవుతుంది. అసలు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించడం ఎలా.. అసలు వాటి లక్షణాలు ఏంటి చూద్దాం.

నేటి ఆధునిక జీవన శైలి వలన మన శరీరానికి సరిపడని తిండిని కూడా మనం తినవలసి వస్తుంది. అదేనే కాదు కాలుష్యంతో సహా ప్రతిదీ మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అందులో ఒకటి కిడ్నీలో రాళ్ల సమస్య. చాలామంది ఈ సమస్య ముదిరిపోయే వరకు తమకి ఆ సమస్య ఉందని గుర్తించలేరు.
అందుకే కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రం విసర్జన చేసే సమయంలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది మంటగా కూడా ఉంటుంది. అలాగే కడుపు కింది భాగంలో తీవ్రమైన నొప్పి తరచుగా వస్తూ ఉంటుంది నడుము ఒకవైపు ఎక్కువగా నొప్పిని కలిగి ఉండటం కూడా ఒక లక్షణమే.
మూత్రంలో రక్తం పడుతుంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించాలి. కారణం లేకుండా వాంతులు వికారం వంటి సమస్యలు వస్తున్నాయంటే కచ్చితంగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ఇక ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు ఏంటో చూద్దాం.
మాంసాహారం ఎక్కువగా తినేవారిలో.. ఆహారానికి సరిపడా నీరు తాగకపోయినా, అధిక బరువు ఉన్న డయాబెటిస్ ఉన్న వ్యాయామం ఎక్కువగా చేయకపోయినా స్టెరాయిడ్లను ఎక్కువ మోతాదులో తీసుకున్న కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించటం మంచిది.
సాంప్రదాయక చర్యలతో చికిత్స చేయలేని కిడ్నీ స్టోన్స్.. అవి చాలా పెద్దవిగా ఉండటం వలన లేదా రక్తస్రావం మూత్రపిండాలు దెబ్బ తినటం లేదా కొనసాగుతున్న మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకి కారణం కావచ్చు మరింత తీవ్రమైన చికిత్స అవసరం కావచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి.
శాశ్వత నివారణ కాదు గాని సత్వర ఉపశమనం కోసం తులసి ఆకుల్ని కషాయం చేసుకొని తాగవచ్చు తులసిలో విటమిన్ బి ఉంటుంది ఇది రాళ్ల సమస్యని దూరం చేస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తొలిసారి నమలటం వలన కిడ్నీ స్టోన్ కరిగి శరీరం నుంచి బయటికి వస్తుంది. జామకాయ తినటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కానీ ఇవేవీ శాశ్వత పరిష్కారాలు కాదు గుర్తుంచుకోండి.