- Home
- Life
- Health
- నారింజ నుంచి బొప్పాయి వరకు.. ఈ పండ్లు వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి తెలుసా..?
నారింజ నుంచి బొప్పాయి వరకు.. ఈ పండ్లు వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి తెలుసా..?
వానాకాలంలో మన ఇమ్యూనిటీ పవర్ ను తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్ని పండ్లు వర్షాకాలంలో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

fruits
పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి పండ్లు పోషకాలకు మంచి వనరులు. వీటిని తింటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే సీజనల్ పండ్లను ఖచ్చితంగా తినాలంటరు ఆరోగ్య నిపుణులు. అయితే కొన్ని సీజనల్ పండ్లు విటమిన్లను, పోషకాలను అందించడంతో పాటుగా మన రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. కొన్ని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి వాటిని తింటే మన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వర్షకాలంలో ఎలాంటి పండ్లను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
నారింజ
నారింజ విటమిన్ సి కి మంచి వనరు. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు చాలా చాలా అవసరం. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి అంటువ్యాధులతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.
బొప్పాయి
బొప్పాయి పండులో ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటుగా మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ సి కంటెంట్ మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
kiwi
కివి
కివి చిన్న పండు. కానీ దీనిలో మన రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కివిలో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రోజు వారి ఆహారంలో కివిని చేర్చడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.
Pomegranates
దానిమ్మ
దానిమ్మలో విటమిన్ సి, ఎలాజిక్ ఆమ్లంతో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడానికి, ఫ్రీ రాడికల్స్ తోో పోరాడటానికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతునివ్వడానికి సహాయపడతాయి. దానిమ్మ విత్తనాలు ఫైబర్ కు మంచి మూలం. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
బెర్రీలు
బెర్రీలు విటమిన్ల బాంఢాగారం. అలాగే ఈ పండ్లలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, ఇతర ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. బెర్రీల్లో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే దీనిలో శోథ నిరోధక ప్రభావాలు కూడా ఉంటాయి.