- Home
- Life
- Health
- తిమ్మిర్ల వస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే భవిష్యత్తులో వచ్చే రోగాలు ఇవే!
తిమ్మిర్ల వస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకపోతే భవిష్యత్తులో వచ్చే రోగాలు ఇవే!
నరాలు ఒత్తిడికి గురైనప్పుడు బహిర్గతమయ్యే లక్షణమే తిమ్మిర్లు (Numbness). తిమ్మిర్లని మొద్దుబారటం అని కూడా అంటారు. దీన్ని వైద్యపరిభాషలో న్యూరోపతిగా పిలుస్తారు. సూదులతో గుచ్చినట్టు, జివ్వుమని లాగేస్తున్నట్టు విచిత్రమైన బాధను కలిగి ఉంటాయి తిమ్మిర్లు. ఎక్కువ సేపు కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చున్నప్పుడు కాళ్లు తిమ్మిరి ఎక్కుతాయి. లేచి అటూ ఇటూ నాలుగు అడుగులు వేయడంతో తిమ్మిర్లు తగ్గిపోతుంది. ఇలా జరగడం సర్వసాధారణం. కానీ ఇలాంటి తిమ్మిర్లు వారాల తరబడి నెలల తరబడి క్రమం తప్పకుండా వేధిస్తుంటే శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తిమ్మిర్ల వ్యాధి సంకేతాలు గురించి తెలుసుకుందాం..

తిమ్మిర్లు సమస్య మిమ్మల్ని తరచూ వేదిస్తూ ఉంటే దానికి గల కారణాల గురించి తెలుసుకోవాలి. తిమ్మిర్ల సమస్యలను నిర్లక్ష్యం (Neglected) చేయరాదు. తిమ్మిర్లు సమస్య నరాలను కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని న్యూరో ఫిజీషియన్ డాక్టర్లు చెబుతున్నారు. తిమ్మిర్లు రెండు రకాలు. అవి పాజిటివ్, నెగిటివ్ తిమ్మిర్లు. సాధారణంగా తిమ్మిర్లు ఏర్పడినప్పుడు 10 నిమిషాలలో తగ్గిపోతాయి. ఇలాంటి తిమ్మిర్లు పాజిటివ్ తిమ్మిర్లు. నెగిటివ్ తిమ్మిర్లలో క్రమంగా స్పర్శ (Touch) తగ్గిపోవటం, నొప్పి ఉండటం, అవయవాలు బలహీనమవటం ఉంటుంది.
ఇలాంటి నెగిటివ్ లక్షణాలను నరాలు (Nerves) పదే పదే ఎక్కువకాలంపాటు ఒత్తిడికి గురవటం వల్ల కలిగే న్యూరోపతీగా భావించాలి. ఈ రకమైన సమస్యనే వైద్య పరిభాషలో ప్రెషర్ పాల్సీ అంటారు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా మధుమేహ (Diabetes) బాధితులలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ మద్యపానం సేవించే వారిలోనూ క్యాన్సర్, ఎయిడ్స్ రోగులలో ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి అరిచేతులు, అరికాళ్లలో మంటలు ఉంటాయి. దీనికి కారణం శరీరంలో ఉండే నరాలపైన మెలనిన్ అనే కొవ్వు పదార్థం కరిగిపోయి అరికాళ్లు, అరిచేతుల మంటలు ఏర్పడుతాయి.
మధుమేహం ఉన్నవాళ్లలో రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తసరఫరా (Blood circulation) తగ్గుతుంది దాంతో మంటలు ఏర్పడతాయి. తిమ్మిరి సమస్యలు మొదట కాళ్లల్లో మొదలయ్యి శరీర అన్ని అవయవాలకు (Organs) వ్యాపిస్తాయి. ఈ సమస్యలు రావడానికి గల కారణాలు మనం తినే ఆహారంలో సరైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు లేకపోవడంతో శరీరానికి తగిన పోషకాలు అందక ఈ సమస్యలు వస్తాయి. తిమ్మిర్లు వంశపారం పర్యంగా కూడా వస్తాయి. ఈ వ్యాధిగ్రస్తులు చాలా తేలికగా తిమ్మిర్లకు గురవుతారు. పక్షవాతానికి తిమ్మిర్లకు చాలా దగ్గర సంబంధం ఉంది.
ముఖ్యంగా కొన్ని వ్యాధుల్లో మొదట తిమ్మిర్లు కనిపిస్తాయి. కొంతకాలానికి అవే పక్షవాతానికి (Paralysis) దారి తీస్తాయి. తిమ్మిర్ల లక్షణాన్ని బట్టి రోగాన్ని నిర్ధారించి చికిత్స చేయటంతోపాటు తిమ్మిర్ల తీవ్రతను తగ్గించటానికీ చికిత్స చేస్తారు. ఇందులో భాగంగా నోటి మాత్రలతోపాటు క్యాప్సేసిన్ అనే పైపూత మందును కూడా వాడవచ్చు. తిమ్మిర్లు కలిగే ప్రదేశంలో ఉపయోగించే లోకల్ అనస్థటిక్ స్ర్పేలు వాడవచ్చు. తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే జీవనశైలిలో (Lifestyle) కొన్ని మార్పులు చేసుకోవాలి.
ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారు గంటకు ఒక సారైనా లేచి ఐదు నిమిషాలు నడవాలి. బిగుతుగా ఉండే బూట్లు (Shoes) ధరించరాదు. ఫ్లూటిస్ట్, తబలా కళాకారులు వేళ్లు ఒత్తిడికి (Pressure) గురయ్యే ప్రదేశాల్లో కుషన్స్, ప్యాడ్స్ ఉపయోగించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒకేచోట కూర్చొని మన కాళ్లు తిమ్మిర్లకు గురవుతాయి. అలాంటప్పుడు మనం రెండు గంటలకు ఒకసారి అయినా ఐదు నిమిషాలు నడవాలి.