Mushroom Health Benefits: పుట్టగొడుగులు తింటే క్యాన్సర్ తగ్గుతుందా?
పుట్టగొడుగులుయాంటీఆక్సిడెంట్లతో నిండిన అణుగులు క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. విటమిన్ డి, ఫైబర్‌కి మంచి మూలం అయిన ఇవి ఎముకల ఆరోగ్యానికి, మధుమేహ నిర్వహణకు మేలు చేస్తాయి. రోజూ అణుగు తింటే మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

చాలామంది పుట్ట గొడుగులను ఇష్టంగా తింటారు. మంచి రుచితో పాటు వాటిలో ఉండే పోషకాలే ఇందుకు కారణం. పుట్ట గొడుగుల్లో సెలీనియం, ఎర్గోథియోనైన్ అనే యాంటీఆక్సిడెంట్లు, బి విటమిన్లు, రాగి ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు మష్రూమ్స్ లో పొటాషియం, రాగి, ఐరన్, భాస్వరం లాంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పుట్టుగొడుగులు తింటే కొన్ని జబ్బులు మన జోలికి రావట. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్ నివారణ
పుట్టగొడుగుల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్‌లను నివారించడంలో సహకరిస్తాయి. సెలీనియం క్యాన్సర్‌ని నివారిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ డి, కోలిన్ ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో లేదా చికిత్స చేయడంలో విటమిన్ డి, కోలిన్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడు ఆరోగ్యానికి
పుట్టగొడుగులు మెదడు ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడతాయి. ఇవి తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే అనేక పోషకాలు మెదడు కణాలను యాక్టివ్ చేస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. బ్రెయిన్‌కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే వారంలో ఒకసారి అయినా పుట్టగొడుగులు తినడం మంచిది అంటున్నారు నిపుణులు.
2017 పెన్ స్టేట్ అధ్యయనం ప్రకారం, పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనైన్, గ్లుటాతియోన్‌లు అధిక సాంద్రతలో ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కలిసి వృద్ధాప్య లక్షణాలకు కారణమయ్యే శారీరక ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
షుగర్ పేషెంట్లకు
పుట్ట గొడుగులు తినడం వల్ల షుగర్ బారిన పడే ముప్పు తగ్గుతుందట. వీటిలో ఉండే ఫైబర్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పుట్టగొడుగులు విటమిన్ డికి మంచి మూలం. ఎముకలను బలోపేతం చేయడంలో ఇవి సహాయపడతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోజువారీ విటమిన్ డి అవసరాన్ని తీర్చుకోవచ్చు.
ఎంత తినాలి?
రోజుకు సుమారు 18 గ్రాముల పుట్టగొడుగులను తినాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక కప్పు వరకు తరిగినవి తినవచ్చంటున్నారు.
ఎక్కువ తింటే?
రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, ఎక్కువ తినడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చట. పుట్టగొడుగుల్లో చిటిన్, మన్నిటాల్, ట్రెహలోస్ వంటి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టం.