పురుషులూ జర జాగ్రత్త.. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణం ఇదే..!
పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి పురుషులు ఎదుర్కొనే సమస్యల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఒకటి. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ దీనివల్ల వంధ్యత్వం సమస్య వస్తుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ స్మెర్మ్ కౌంట్ తగ్గడం చాలా సహజం. కానీ ప్రస్తుతం యువకులు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. కానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. లైంగిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి స్త్రీ పురుషులు ఎదుర్కొనే సమస్యలు వేరువేరుగా ఉంటాయి. వంధ్యత్వం ఈ రెండు లింగాలను ప్రభావితం చేసినప్పటికీ.. దీనికి దారితీసే కారణాలు మాత్రం మారుతూ ఉంటాయి. పురుషులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం ఒకటి. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వయసు
స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి వయసు కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వీర్యకణాల పరిమాణం, నాణ్యత తగ్గుతాయి. ఇది సంతానలేమికి దారితీస్తుంది. అలాగే జన్మించిన శిశువులకు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
జీవన విధానం
మన జీవనశైలికి, అలాగే మన ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అలాగే జీవనశైలి స్పెర్మ్ కౌంట్ పై కూడా ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్, ఇతర మాదకద్రవ్యాలు, పొగాకు వాడకం ఇవన్నీ వీర్య కణాల సంఖ్యను ప్రతికూలంగా ప్రభావితం చేసే చెడు అలవాట్లు.
sperm
ఒత్తిడి
ఒత్తిడి లేదా యాంగ్జైటీ కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుంది. ఆఫీస్ పనులు లేదా ఇంటి పనులు వంటివన్నీ ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవన్నీ పురుషులను ప్రభావితం చేస్తాయి.
sperm
మందులు
కొన్ని మందులను తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. అందుకే పురుషులు తీసుకునే సప్లిమెంట్లు, స్టెరాయిడ్ల వాడకంపై దృష్టి పెట్టాలి.
sperm
రోగాలు
కొన్ని వ్యాధులు ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థలో పాల్గొన్న అవయవాలను ప్రభావితం చేసే వ్యాధులు కూడా స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. అనారోగ్యాల మాదిరిగానే కొన్ని గాయాలు కూడా స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా వృషణాలలో లేదా దాని చుట్టుపక్కల అయ్యే గాయాలు.
<p>sperm</p>
వాతావరణం
కొందరికి వాతావరణం కూడా వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా వేడి. ఎందుకంటే వేడి స్పెర్మ్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే వృషణాలలో లేదా చుట్టుపక్కల ఎప్పుడూ వేడి చేరే వాతావరణంలో ఉండటం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది.
<p>sperm</p>
రసాయనాలు
కొన్ని రసాయనాలు కూడా స్పెర్మ్ ఉత్పత్తిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది ఎక్కువగా కర్మాగారాలలో పనిచేసేవారిలో, ఎరువులు లేదా రసాయనాలు ఉండే ప్రదేశాల్లో ఉండేవారిలో కనిపిస్తుంది.
రేడియేషన్
ఎక్కువ కాలం రేడియేషన్ కు గురికావడం వల్ల కూడా స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. సెల్ ఫోన్ ను ప్యాంట్ జేబులో పెట్టుకోవడం మంచిది కాదని పురుషులకు సలహా ఇవ్వడం వెనుక కూడా కారణం కూడా ఇదే.