ఎండాకాలంలో పనస పండును తింటే?
జాక్ ఫ్రూట్ ను తినడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కడుపు సమస్యలు తగ్గిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఈ పండును ఎండాకాలంలో తినడం మంచిదేనా?

పనసను కూరగాయగా, పండుగా తీసుకోవచ్చు. ఈ రెండూ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. శతాబ్దాలుగా పనసపండును కూరగాయగా ఉపయోగిస్తున్నారు. పనస పండు రుచి ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఈ జాక్ ఫ్రూట్ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. జాక్ ఫ్రూట్ ను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. కడుపు, చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అయితే పనసలో వేడి చేసే గుణం ఉంటుందని.. దీనిని ఎండాకాలంలో తింటే ఒంట్లో వేడి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎండాకాలంలో పనస పండును తినాలా? వద్దో ఇప్పుడు తెలుసుకుందాం..
జాక్ ఫ్రూట్ ఎందుకంత ప్రత్యేకం
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. పసన పండులో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో రిబోఫ్లేవిన్, థయామిన్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి లు ఉంటాయి.
<p>jackfruit</p>
వేసవిలో పనస పండును తినాలా?
జాక్ ఫ్రూట్ వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతుంది. సాధారణంగా మహిళలు వేసవిలో జాక్ ఫ్రూట్ తినరు. ఎందుకంటే ఇది కడుపులో వేడిని ఉత్పత్తి చేస్తుందని, మొటిమలను కలిగిస్తుందని, అలాగే ఇతర చర్మ సమస్యలను కలిగిస్తుందని భావిస్తారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. జాక్ ఫ్రూట్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేయదు. కానీ దీనిలో ఉండే పోషకాలు చర్మం నుంచి మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే ఈ పండును ఎండాకాలంలో కూడా బేషుగ్గా తినొచ్చు. జాక్ ఫ్రూట్ ను తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు..
<p>jackfruit</p>
జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. జాక్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ లా పనిచేస్తూ పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచడంతో పాటుగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
<p>jackfruit</p>
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది
పబ్ మేడ్ సెంట్రల్ ప్రకారం.. పనస పండులో తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. దీనితో పాటుగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ పండు డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. అలాగే జాక్ ఫ్రూట్ ఉండే ప్రోటీన్ ఫుడ్ ను తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.
చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. జాక్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.
Ripe Jackfruit
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి
పనస పండులో ఉండే పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెను రక్షిస్తాయి.
క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది
పనస పై నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఐసోఫ్లేవోన్లు, లిగ్నన్లు, సాపోనిన్లు వంటి అనేక రకాల ఫైటోన్యూట్రియెంట్స్ ఇందులో ఉంటాయి. ఇది యాంటీహైపర్టెన్సివ్, యాంటిక్యాన్సర్, యాంటీఆల్సర్, యాంటీఏజింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కడుపు పూతలను కూడా తగ్గిస్తుంది.