మందులో సోడా, కూల్ డ్రింక్స్ ను కలుపుకుని తాగితే ఏమౌతుందో తెలుసా?
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అన్న ముచ్చట అందరికీ తెలుసు. అయినా దానిలో ఆరోగ్యాన్ని మరింత పాడు చేసే వాటిని కలుపుకుని తాగుతుంటారు. అసలు మందులో ఏం కలుపుకుని తాగకూడదో తెలుసా?
ఆల్కహాల్ మీ ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ ను ఎంత తాగినా ప్రమాదమే అని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అయినా దీన్ని రోజూ తాగేవారు ఉన్నారు. అయితే చాలా మంది ఆల్కహాల్ ను తప్పుడు పద్దతిలో తాగుతుంటారు. లేదా కొంతమంది మరీ ఎక్కువగా తాగుతుంటారు. ఈ రెండూ మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అసలు ఆల్కహాల్ ను ఎలా తాగకూడదో ఓ లుక్కేద్దాం పదండి.
ఆల్కహాల్, సోడా
చాలా మందికి మందులో సోడా కలుపుకుని తాగే అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ లో సోడాను కలిపి తాగితే రుచి బాగుంటుందని చెప్తుంటారు. కానీ ఈ రెండింటినీ మిక్స్ చేసి తాగితే ఎక్కువ మత్తు వస్తుందని, మందును నీటితో తాగే వారి కంటే వేగంగా మత్తు ఎక్కుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఆల్కహాల్ లో సోడా కలిపి తాగితే..
సోడాలో కార్బోనేటేడ్ వాటర్, ఎక్కువ ఫ్రక్టోజ్, రంగులు, కెఫిన్, ఫాస్పోరిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లంలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సోడాను ఎక్కువగా తాగితే మీకు ఊబకాయం నుంచి డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల వరకు ఎన్నో రోగాలు వస్తాయి.
వైన్, వాటర్
మందులో ఇతర వస్తువులను కలపడం కంటే నీళ్లను కలిపి తాగడం మంచిదంటారు నిపుణులు. ముఖ్యంగా దీనితో గోరువెచ్చని నీరు తాగడం ఇంకా మంచిదంటారు. మీకు తెలుసా? మందుకు నీళ్లను కలపడం వల్ల ఆల్కహాల్ పలుచగా అవుతుంది. ఇధఇ ఘాటైన రుచి, మత్తును తగ్గిస్తుంది. అంతేకాదు ఇది హ్యాంగోవర్ అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
కూల్ డ్రింక్స్ తో ఆల్కహాల్
చాలా మంది కూల్ డ్రింక్స్ ను కూడా మందులో కలుపుకుని తాగుతుంటారు. కానీ అన్ని రకాల సోడా కార్బోనేటేడ్ పానీయాలు, శీతల పానీయాలలో భాస్వరం ఉంటుంది. విస్కీతో ఎక్కువ మొత్తంలో శీతల పానీయాలను తాగడం వల్ల మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే కొవ్వు కాలేయ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ఎంత ఆల్కహాల్ తాగడం కరెక్ట్..
విస్కీ తాగడానికి సురక్షితమైన మొత్తం అంటు ఏదీ లేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే మీరు దీన్ని మితంగా తాగొచ్చు. అంటే మహిళలలు రోజుకు ఒక విస్కీ అంటే 25 మి.లీ, పురుషులు రెండు విస్కీలు 50 మి.లీ తాగొచ్చట.