జీలకర్రను ఎలా తింటే తొందరగా బరువు తగ్గుతారో తెలుసా?
మనకు తెలియదు కానీ.. జీలకర్ర మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? దీన్ని ఉపయోగించి మనం ఫాస్ట్ గా బరువు కూడా తాగొచ్చు. ఇందుకోసం జీలకర్రను ఎలా తినాలంటే?
బరువు తగ్గడానికి మనం ఎన్నో పద్దతులను ఫాలో అవుతుంటాం. రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. ఎందుకంటే బరువు పెరగడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అయితే బరువును తగ్గించుకోవడానికి జీలకర్ర కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర బరువును ఎలా తగ్గిస్తుందంటే?
జీలకర్ర
జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది.
జీలకర్ర గింజలు వాడండి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు తగ్గడానికి మీరు రోజుకు రెండు పూటలా జీలకర్రను తీసుకోండి. ఇందుకోసం మీ రోజువారి ఆహారంలో జీలకర్రను ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. మీరు ఆహారంలో టెంపరింగ్ గా కూడా జోడించొచ్చు.
jeera seeds
జీలకర్ర నీరు తాగాలి
జీలకర్ర నీరు కూడా మీరు బరువు తగ్గడానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే కాసేపు మరిగించి చల్లారిన తర్వాత తాగండి. అలాగే మిగిలిన జీలకర్రను నమిలి తినండి.
jeera water
బరువు తగ్గుతారు
జీలకర్ర ను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. జీలకర్ర వాటర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
జీవక్రియ
జీలకర్రను తిన్నా ఈ వాటర్ ను తాగినా మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇది మీ శరీరానికి ఎనర్జీ కూడా అందుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ
జీలకర్రను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కూడా అవుతాయి. అందుకే ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదర సమస్యలను తొలగిస్తుంది
జీలకర్రను తినడం వల్ల మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి ఉదర సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.