కొబ్బరి నీళ్లను తాగితే వారంలో కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
మూత్రపిండాలను శుభ్రపరచడానికి కొబ్బరి నీటికి మించిన మంచి మార్గం లేదంటున్నారు నిపుణులు. అవును కొబ్బరి నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
coconut water
మన శరీరానికి మూత్రపిండాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. మూత్రపిండాలు శరీరంలోని మురికిని బయటటకు పంపేందుకు, సిరలను శుభ్రపరిచేందుకు సహాయపడతాయి. అలాగే ఇవి శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని అన్ని భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ మూత్రపిండాలలో మన ఆహారం నుంచి కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్, యూరియా పేరుకుపోవడం వల్ల దాని వడపోత పని ప్రభావితం అవుతుంది. ఇది ఎన్నో మూత్రపిండాల సమస్యలకు, స్టోన్స్ కు కారణమవుతాయి. అందుకే కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొబ్బరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి, కిడ్నీ స్టోన్స్ ను కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది.
Image: Getty Images
కొబ్బరి నీరు మూత్రపిండాల్లో రాళ్లకు ఎలా సహాయపడుతుంది?
మూత్రపిండాలను శుభ్రపరచడానికి కొబ్బరి నీటిని మించిన మంచి మార్గం లేదంటారు నిపుణులు. మీరు మీ మూత్రపిండాల పనితీరును మెరుగుపరచాలనుకుంటేకొబ్బరి నీటిని క్రమం తప్పకుండా తాగాలని సైన్స్ కూడా నమ్ముతుంది. ఎందుకంటే కొబ్బరి నీరు మూత్రంలో పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ విసర్జనను పెంచుతుంది. అవి శరీరంలో పేరుకుపోకుండా చేస్తుంది. ఈ విధంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను నివారిస్తుంది.
Image: Getty Images
మూత్రపిండాల పేషెంట్ల కోసం కొబ్బరి నీరు
మూత్రిపిండాల రాళ్లను తగ్గించడంలో కొబ్బరి నీరు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా పొటాషియం ఎక్కువగా ఉండే కొబ్బరి నీరు కిడ్నీలో రక్త ప్రసరణను సరిచేస్తుంది. అలాగే దాని పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లను తాగండి.