ఈ బ్లడ్ గ్రూప్ వారికి.. గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ..!
ఇటీవల పరిశోధకులు చేసిన ఓ పరిశోధన ప్రకారం... A, B, లేదా AB బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులు O బ్లడ్ గ్రూప్ ఉన్న వారితో పోలిస్తే గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందట.

మన శరీరంలో ఎలాంటి భాగమైనా మార్చుకునే అవకాశం ఉంటుందేమో కానీ.. మన బ్లడ్ గ్రూప్ ని మాత్రం మార్చుకోలేం. మానవ రక్తాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. అవి A, B, AB, O. దాదాపు మన బ్లడ్ గ్రూప్ ఏది అనేది.. మన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంది.
కాగా.. ఈ బ్లడ్ గ్రూప్ లను పట్టి.. ఎవరికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చట. ముఖ్యంగా కొన్ని బ్లడ్ గ్రూప్ ల వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇటీవల పరిశోధకులు చేసిన ఓ పరిశోధన ప్రకారం... A, B, లేదా AB బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులు O బ్లడ్ గ్రూప్ ఉన్న వారితో పోలిస్తే గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందట. AB బ్లడ్ గ్రూప్‌ని కలిగి ఉండటం చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు.
20 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 89,550 మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని డేటా వెల్లడించింది. టైప్ B రక్తం ఉన్నవారిలో 11 శాతం , టైప్ A రక్తం ఉన్నవారిలో ఐదు శాతం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వ్యక్తులు తమ రక్త వర్గాన్ని మార్చుకోలేనప్పటికీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుందో వైద్యులు బాగా అర్థం చేసుకోవడంలో ఈ ఫలితాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మీకు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ ఉంటే, మీరు ముందస్తుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. దీని వల్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యాపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.
World Blood Donor Day
ఓ బ్లడ్ గ్రూప్‌కు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటమే కాకుండా కడుపు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. మరోవైపు, టైప్ A రక్తం ఉన్నవారికి కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..పైలోరీ ఇన్ఫెక్షన్, సాధారణంగా కడుపులో కనిపించే బ్యాక్టీరియా, రకం A రక్తం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా వాపు , అల్సర్‌లకు కారణమవుతుంది.
ఇంకా, AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు జ్ఞాపకశక్తి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. టైప్ A రక్తం ఉన్నవారికి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఎక్కువగా ఉండవచ్చు అని పరిశోధకులు అభిప్రాయం తెలియజేశారు.