శరీరానికి శక్తినందించే హెల్తీ డ్రైఫ్రూట్స్ చాట్ స్నాక్ ఐటమ్స్.. ఎలా చెయ్యాలంటే?
మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది. కనుక జంక్ ఫుడ్స్ బదులుగా మంచి హెల్తీ స్నాక్ ఐటమ్స్ (Healthy snack items) లను కుటుంబ సభ్యులకు అందిస్తే వారి శరీరానికి కావలసిన శక్తి లభించి ఆరోగ్యంగా ఉంటారు.

Dried Fruits Chat
కనుక మంచి హెల్దీ స్నాక్స్ ఐటమ్ అయిన డ్రైఫ్రూట్స్ చాట్ (Dried Fruits Chat) ను ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ హెల్తీ స్నాక్ ఐటమ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
Dried Fruits Chat
కావలసిన పదార్థాలు: ఇరవై బాదం (Almonds), ఇరవై జీడిపప్పు (Cashew) పలుకులు, ఇరవై ఐదు పిస్తా (Pistachio) పలుకులు, ఐదు ఖర్జూరాలు (Dates), సగం కప్పు కిస్మిస్ (Raisins), పది వాల్ నట్స్ (Walnuts), పావుకప్పు పూల్ మఖానీ (Pool Makhani), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee).
Dried Fruits Chat
రెండు స్పూన్ ల చాట్ మసాలా (Chat masala), ఒక స్పూన్ గరంమసాలా (Garam masala), ఒక నిమ్మకాయ (Lemon), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), కొద్దిగా కొత్తిమీర (Coriyander) తరుగు, పావు కప్పు పనీర్ (Paneer) ముక్కలు.
Dried Fruits Chat
తయారీ విధానం: ముందుగా రెండు గంటల పాటు జీడిపప్పు, కిస్మిస్, బాదంలను విడివిడిగా నానపెట్టుకోవాలి (Should be soaked). ఆ తర్వాత నీటిని వంపేసి బాదం పొట్టు తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, ఖర్జూరం, వాల్ నట్స్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి (Cut into small pieces).
Dried Fruits Chat
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఫుల్ మఖానీ వేసి నూనె లేకుండా (Without oil) దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ పలుకులన్నీ వేసి దోరగా వేయించుకుని (Frying) ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
Dried Fruits Chat
ఇప్పుడు ఇదే కడాయిలో మరికాస్త నెయ్యి వేసి పనీర్ ముక్కలను (Paneer slices) కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో వేయించుకున్న వాటన్నింటినీ వేసి చాట్ మసాలా, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, జీలకర్ర పొడి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి (Mix well).
Dried Fruits Chat
ఇలా తయారుచేసుకున్న డ్రై ఫ్రూట్స్ చాట్ ఫై కొత్తిమీర తరుగును చల్లుకుని గార్నిష్ (Garnish) చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ డ్రైఫ్రూట్స్ చాట్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్తీ స్నాక్ ఐటం ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్ ఐటంను తీసుకుంటే ఆరోగ్యానికి మంచివి (Good for health).
Dried Fruits Chat
ఈ రెసిపి తయారీ కోసం ఉపయోగించిన డ్రైఫ్రూట్స్ (Dried fruits) లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) రాకుండా సహాయపడతాయి.