Health Tips: నీరసంతో బాధపడుతున్నారా.. అయితే నివారణ మార్గాలు ఇవే?
Health Tips: చాలామందికి పొద్దున్న లేస్తూనే నీరసంగా డల్ గా కనిపిస్తారు. సరిపడినంత ఆహారం తీసుకున్న కూడా ఎందుకు నీరసం వస్తుంది. దానికి కారణాలు నివారణ మార్గాలు తెలుసుకుందాం.

చాలామంది సరిపడినంత ఆహారం తీసుకున్నప్పటికీ.. కంటి నిండా నిద్రపోయినప్పటికీ ఎందుకో బాగా నీరసంగా కనిపిస్తారు. కారణం తెలియని నీరసం వల్ల లేనిపోని కోపంతో ఇతరుల మీద కేకలు వేస్తూ ఉంటారు. వాళ్ల కోపానికి గురి అవుతారు. ఇదంతా వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది.
కానీ ఈ విషయం ఎదుటి వాళ్లు గుర్తించలేరు కదా. అందుకే అసలు నీరసం ఎందుకు వస్తుందో చూద్దాం. మొట్టమొదట నీరసం రావడానికి కారణం శరీరానికి అవసరమైన నీళ్లు తాగకపోవడం. శరీరానికి అవసరమైన నీరు..
అందకపోవడం వల్ల అది నీరసానికి గురవుతుంది. కాబట్టి నీరసం అనిపించిన వెంటనే కాస్త నీళ్లు తాగండి క్రమం తప్పకుండా ప్రతిరోజు మూడు లీటర్లు నీరు తాగండి. అలాగే నీరసానికి ఐరన్ లోపం కూడా ఒక కారణం.
కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన నీరసం తగ్గించుకోవచ్చు ఐరన్ ఎక్కువగా ఆకుపచ్చగా ఉండే కూరగాయల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆ కూరల్ని తీసుకోండి. నీరసానికి మరొక ముఖ్య కారణం బ్రేక్ఫాస్ట్ మానేయటం. స్కూల్లకి ఆఫీసులకు వెళ్లే హడావిడిలో చాలామంది పొద్దున్న టిఫిన్ మానేస్తారు.
దీనివల్ల చాలా త్వరగా నీరసం వస్తుంది కాబట్టి పెట్టి పరిస్థితుల్లోని బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకండి అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. కడుపునిండా ఆహారం తిన్నాను కదా అనుకుంటారు కానీ ఆ తిండిలో శరీరానికి అవసరమైన పోషణ ఉండదని గుర్తించరు.
కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినండి. అలాగే యోగ చేయటం లేదంటే శరీరానికి అవసరమైన వ్యాయామం చేయటం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి నీరసాన్ని పక్కనపెట్టి చురుగ్గా మీ పనులు చేసుకుంటారు. సో ఈ చిట్కాలు పాటించి నీరసాన్ని తరిమికొట్టండి.