Health Tips: పిరుదుల్లో దురదను లైట్ తీసుకున్నారంటే అంతే.. ఇది ఎన్ని సమస్యలకు కారణమో తెలుసా?
Health Tips: శరీర భాగాల్లో అపుడప్పుడు దురద పెడుతుంటుంది. ఇది చాలా కామన్. అయితే కొంతమందికి పిరుదుల్లో దురద మరీ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ దురద ఎన్నో సమస్యలకు కారణం కావొచ్చు.
hips pain
మనలో చాలా మంది మనకున్న కొన్ని సమస్యల గురించి డాక్టర్ తో అస్సలు చెప్పం. ఎందుకంటే డాక్టర్ ఏమనుకుంటారేమోనని. ఇలాంటి వాటిలో ఒకటి పిరుదుల్లో దురద. పిరుదల్లోనే కాదు చేతులు, కాళ్లు, తల, చంకలు, ప్రైవేట్ భాగంలో దురద వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ హాస్పటల్ కు మాత్రం వెళ్లరు. ఈ విషయాన్ని డాక్టర్ కు చెప్పడానికి సిగ్గుపడి ఎంత ఇబ్బంది పడినా అలాగే ఉంటారు. కానీ శరీరంలోని ఏ భాగంలోనైనా దురదను చాలా కాలం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ సమస్య ప్రమాదకరంగా మారుతుంది. అందుకే దాన్ని లైట్ తీసుకోకండి. దురదకు ప్రధాన కారణం పరిశుభ్రత లేకపోవడమేనంటున్నారు నిపుణఉలు. అయితే ఇది మాత్రమే కారణం కాదు. తుంటిలో దురద ఎన్నో తీవ్రమైన సమస్యలను సూచిస్తుంది. సకాలంలో హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోకపోతే మీ ఆరోగ్యం బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే పిరుదుల్లో దురద పెట్టడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్
ఇంపెటిగో అనేది చాలా సాధారణ చర్మ సంక్రమణ. ఇది దురదకు కారణమవుతుంది. అలాగే ఇది కొన్ని కొన్ని సార్లు గాయాలను కూడా కలిగిస్తుంది. ఇంపెటిగో ఏ వయసులోనైనా ఎవ్వరికైనా వస్తుంది. అలాగే ఇది శరీరంలోని చాలా భాగాలలో దురదను కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదకరం కానప్పటికీ.. సమయానికి హాస్పటల్ కు వెళ్లడమే మంచిది.
buttocks pain
డయాబెటిస్
దురదతో పాటుగా చర్మంపై మచ్చలు కనిపిస్తే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇది డయాబెటిస్ వల్ల కూడా కావొచ్చు. దురద ఫ్రీక్వెన్సీ, పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అవసరమైన టెస్టులు చేసి డాక్టర్లు చికిత్స చేస్తారు. దీంతో ఏ సమస్యనైనా సకాలంలో తగ్గించుకోవచ్చు.
buttocks pain
ఎస్టీఐ
ఎస్టీఐలు అంటే లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా దురదకు కారణమవుతాయి తెలుసా. అంటే అపరిశుభ్రమైన, అసురక్షితమైన శృంగారంలో పాల్గొనేవారికి ఎస్టీఐ లు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్యను దాచిపెట్టడానికి బదులుగా హస్పటల్ కు వెళ్లండి. సమస్య ఏంటో తెలుస్తుంది.