పెయిన్ కిల్లర్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతింటాయా?
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయపోయినా.. దెబ్బతిన్నా.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మూత్రపిండాలు వివిధ కారణాల వల్ల దెబ్బతింటాయి.
మూత్రపిండాల వ్యాధులు లేదా మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. అదనపు ద్రవాలను కూడా బయటకు పంపుతాయి. ఇది మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మూత్రపిండాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. అసలు మూత్రపిండాలు దెబ్బతినడానికి కొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
kidney health
డయాబెటిస్ మెల్లిటస్
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే సమస్యలను డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ జీవనశైలి వ్యాధి. మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కానప్పుడు లేదా ఇన్సులిన్ హార్మోన్ ను ఉపయోగించలేనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. అలా డయాబెటిస్ వస్తుంది. చాలా మందిని ప్రభావితం చేసే టైప్ -2 డయాబెటిస్ ను చికిత్సతో కూడా పూర్తిగా నయం చేయలేము. ఆహారంతో పాటుగా జీవనశైలి ద్వారా మాత్రమే దీనిని నియంత్రించొచ్చు. అయితే మధుమేహాన్ని నియంత్రించలేకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మూత్రపిండాల్లోని రక్తనాళాలు దెబ్బతిని దీని పనితీరు దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని 'డయాబెటిక్ నెఫ్రోపతి' అంటారు. దీన్ని నివారించడానికి ఏకైక మార్గం మధుమేహాన్ని నియంత్రించడం.
రక్తపోటు
బీపీ లేదా అధిక రక్తపోటు కూడా మూత్రపిండాలకు ముప్పుగా మారుతుంది. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీల్లోని రక్తనాళాలు ఒత్తిడికి గురవుతాయి. దీంతో మూత్రపిండాల సమస్యలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే బీపీని కంట్రోల్ చేసుకోవాలి. ఉప్పు, సోడియం కలిగిన ఇతర ఆహారాలను తగ్గించాలి. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వాడకాన్ని పూర్తిగా వదిలేయాలి. అలాగే బీపీని నియంత్రించడానికి మందులను తప్పనిసరిగా వాడాలి.
kidney health
పెయిన్ కిల్లర్స్
నొప్పులను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ను రెగ్యులర్ గా వాడే వారు చాలా మందే ఉన్నారు. అయితే పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను నాశనం చేస్తాయని ఖచ్చితంగా చెప్పేవారూ ఉన్నారు. కానీ ఇది నిజం. దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు ఉంటే మీ మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ పెయిన్ కిల్లర్స్ క్రమంగా మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో కిడ్నీలు ప్రమాదంలో పడతాయి. డాక్టర్ చెప్పకపోతే పెయిన్ కిల్లర్స్ ను అస్సలు వాడకండి. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
kidney health
నిర్జలీకరణం
శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గడం వల్ల శరీరం నిర్జలీకరణం బారిన పడుతుంది. అయితే శరీరంలోని నీరు ఎక్కువ మొత్తంలో తగ్గడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితి మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తుంది. దీంతో మీరు సరిగ్గా పనిచేయలేరు. క్రమంగా ఇది మూత్రపిండాల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది.
kidney stone
ధూమపానం, మద్యపానం
ధూమపానం, మద్యపానం వంటి మాదకద్రవ్యాల వాడకం కూడా మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ చెడు అలవాట్లన్నీ మూత్రపిండాల్లోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. నెమ్మదిగా మూత్రపిండాల పనితీరు కూడా ప్రమాదంలో పడుతుంది.