పసుపు ఏం చేస్తుందిలే అనుకుంటే పొరపాటే.. ఇది ఎన్ని రోగాలను తగ్గిస్తుందో తెలుసా?
గుండెజబ్బుల నుంచి డయాబెటీస్ వరకు పసుపు ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. ఎన్నో వ్యాధులు తొందరగా నయమయ్యేందుకు సహాయపడుతుంది.
పసుపును దాదాపు అన్ని రకాల కూరగాయల్లో ఉపయోగిస్తారు. నిజానికి పసుపు మన శరీరానికి, మెదడుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే ప్రధాన క్రియాశీల పదార్ధం బలమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.
గుండె జబ్బులను తగ్గించేందుకు కర్కుమిన్ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హార్ట్ పేషెంట్లకు ఈ కర్కుమిన్ ఎండోథెలియం పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రక్త నాళాల పొర. కర్కుమిన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేయడంలో పసుపు ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్జీమర్స్ వ్యాధి చిత్తవైకల్యానికి అత్యంత సాధారణ రూపం. పసుపులో ఉండే ఇతర సమ్మేళనాలు అల్జీమర్స్ వ్యాధిని తగ్గించానికి సహాయపడతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పసుపు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి పసుపు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రీ డయాబెటిస్ ఉన్న 240 మంది పెద్దలను అనుసరించిన ఒక అధ్యయనంలో.. 9 నెలల్లో కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కనుగొన్నారు.
turmeric
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. హెర్పెస్, ఫ్లూతో సహా ఎన్నో రకాల వైరస్ లతో పోరాడటానికి కర్కుమిన్ ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా కర్కుమిన్ సప్లిమెంట్స్ పిఎంఎస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు. పసుపు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.
Image: Freepik
మొటిమలు, కళ్ల చుట్టూ మచ్చలు, డార్క్ సర్కిల్స్, పొడి చర్మం నుంచి స్ట్రెచ్ మార్క్స్ వరకు ప్రతిదాన్ని తగ్గించడానికి పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. ఇది చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేస్తుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియా మన శరీరానికి దూరంగా ఉండేలా చేస్తుంది.