MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • ఎండాకాలంలో చల్ల చల్లని చెరకు రసం.. తాగితే ఎన్ని లాభాలో..!

ఎండాకాలంలో చల్ల చల్లని చెరకు రసం.. తాగితే ఎన్ని లాభాలో..!

ఎండాకాలంలో చల్లగా ఉండే పానీయాలు మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా చెరకు రసం.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 30 2023, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చెరకు చక్కెర ఉత్పత్తిలో ఉపయోగించే ప్రధాన పంటలలో ఒకటి. ప్రపంచంలో ఉపయోగించే చక్కెరలో 70% వరకు చెరకు నుంచే తయారవుతుంది. మిగిలిన 30% చక్కెర దుంప పంట నుంచి వస్తుంది. అయితే బ్రెజిల్ తర్వాత చెరకు ఉత్పత్తిలో రెండవ ప్లేస్ లో భారత్ ఉంది. భారతదేశంలో పండించే చెరకులో చాలా భాగం మొదటగా బెల్లం తయారీకే ఉపయోగిస్తారు. ఆ తర్వాత శుద్ధి చేయని లేదా బ్రౌన్ షుగర్ కు ఉపయోగిస్తారు. ఆ తర్వాత రసాయనాలు, సల్ఫర్ ఉపయోగించి ప్రాసెస్ చేయబడిన చక్కెరను తయారుచేస్తారు. చెరకు 36 రకాలుగా లభిస్తుంది. చెరకులో కొవ్వులు మొత్తమే ఉండవు. ఇది 100 శాతం సహజ పానీయం. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా వేసవిలో చెరకు రసాన్ని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక గ్లాసు చెరకు రసం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. ఇది మీ శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

36
<p>sugarcane-juice</p>

<p>sugarcane-juice</p>

చెరకులో ఉండే చక్కెర, ఫ్లేవనాయిడ్లతో కలిపి, గ్లైకోసైడ్లను ఏర్పరుస్తుంది. ఇవి మన శరీరంపై ఆల్కలీన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది మన కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. 

46

చెరకు రసం మీ కాలేయాన్ని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది కామెర్లను సహజంగా తగ్గిస్తుంది. వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చెరకు రసంలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని సంక్రమణ నుంచి రక్షిస్తాయి. అలాగే బిలిరుబిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 
 

56

చెరకులోని సుక్రోజ్ మీ శరీరానికి కావాల్సిన సరైన మొత్తంలో శక్తిని ఇస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలలో ముఖ్యమైనది చెరకులోని గ్లైకోలిక్ ఆమ్లం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

66

ఒక గ్లాసు చెరకు రసంలో అల్లాన్ని కలిపి తాగితే గర్భిణులకు మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది. చెరకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖనిజ లోపం కూడా పోతుంది.  చెరకు రసంలో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. చెరకు రసాన్ని తీసిన వెంటనే తాగాలి. ఎందుకంటే ఇది 15 నిమిషాల్లో ఆక్సీకరణం చెందుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved